Star Hero: స్టార్ హీరో ఇలా అయిపోయాడేంటి.. గుర్తుపట్టారా?

  • April 17, 2023 / 07:59 PM IST

ఒకప్పుడు స్టార్ హీరోలు.. తమ సినిమాల్లో లుక్స్ మార్చడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఇంకా బెటర్ గా ఉన్న లుక్ ట్రై చేయడానికి అయితే రెడీగా ఉంటారు. కానీ నెగిటివ్ షేడ్స్ కలిగిన లుక్ లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేస్తేనే.. ఎంతటి స్టార్ హీరోని అయినా సంపూర్ణ నటుడు అంటున్నారు. అందుకోసం లుక్స్ మార్చుకోవడానికి కూడా కొంతమంది స్టార్ హీరోలు వెనుకాడటం లేదు.

పైన ఉన్న ఫోటోలో మీరు చూస్తున్నది ఓ (Star Hero) స్టార్ హీరో. చూస్తే టక్కున గుర్తు పట్టడం కష్టం. మరీ అతని వీరాభిమానులు అయితే తప్ప. అతనెవరో ఈపాటికే మీరు గుర్తుపట్టేసి ఉంటారు కదా..! ఎస్.. అతను మరెవరో కాదు విక్రమ్. తన కొత్త సినిమా ‘తంగలాన్’ కోసం ఇలా మారిపోయాడు విక్రమ్. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి విక్రమ్ బర్త్ డే స్పెషల్ గా ఓ మేకింగ్ వీడియో గ్లింప్స్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ మూవీ గ్లింప్స్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వారందరికీ నచ్చేలా మేకింగ్ తో పాటు ఓ అద్బుతమైన వీడియో రిలీజ్ చేశారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్(కేజీఎఫ్) నేపథ్యంలో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా.. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా పా.రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇందులో విక్రమ్ లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇలాంటి వైవిధ్యమైన పాత్రలకు విక్రమ్ ఎప్పుడూ ది బెస్ట్ ఇస్తాడు. అది మరోసారి ప్రూవ్ అయ్యింది.

ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న తంగలాన్ లో విక్రమ్ తో పాటు ఫీమేల్ లీడ్స్ లో పార్వతి, మాళవిక మోహనన్ నటిస్తుండగా.. ఓ కీలక పాత్ర కోసం హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్లాగిరోన్ ను తీసుకున్నారు. ఇతర పాత్రల్లో పశుపతి, హరికృష్ణన్, అన్బుదురై, ప్రీతి కరణ్, ముత్తు కుమార్ తో పాటు అనేకమంది స్టార్స్ నటిస్తున్న మూవీ ఇది.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus