అతనొక పెద్ద హీరో (Star Hero). ఓ పెద్ద దర్శకుడి సినిమా వల్ల దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అతనికి పొరుగు రాష్ట్రాల్లో కూడా అభిమానులు ఏర్పడ్డారు. అయినప్పటికీ వరుసగా మాస్ సినిమాలు మాత్రమే చేయకుండా.. అన్ని రకాల జోనర్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మధ్యలో ప్లాపులు పలకరించినా.. తర్వాత రెండు బ్లాక్ బస్టర్లు కొట్టి ఫామ్లోకి వచ్చాడు. అలాగే ఈ సినిమాల షూటింగ్ల టైంలో ఇంకో 4 ప్రాజెక్టులకు సైన్ చేశాడు. అందులో చాలా వరకు సెట్స్ పైకి వెళ్ళాయి.
ఒకటి, రెండు మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అయితే సెట్స్ పైకి వెళ్లిన సినిమాలు ఏవీ కూడా కంప్లీట్ అవ్వడం లేదు. 3 ఏళ్ళ క్రితం చప్పుడు లేకుండా మొదలైన సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు. ఆ సినిమా రషెస్ చూశాక మూవీ యూనిట్.. ప్యాచ్ వర్క్ అవసరమని భావించిందట. ఇందులో భాగంగా హీరోగారి క్లోజప్ షాట్స్ కూడా కావాలి. కానీ హీరో గారు అందుబాటులో లేరు. విదేశాల్లో ఈయన ఒక విల్లా అద్దెకు తీసుకున్నారట.
దానికి నెలకు రూ.70 లక్షల పైగా రెంట్ కడుతున్నారట. నెలలో దాదాపు 20 రోజుల పాటు అక్కడే ఉంటున్నాడట ఈ స్టార్ హీరో. మిగిలిన 10 రోజులు షూటింగ్ కి వచ్చినా.. ఒంట్లో బాలేదు అని చెప్పి త్వరగానే వెళ్ళిపోతూ ఉంటాడట. దీంతో బ్యాలెన్స్ పార్ట్ ను డూప్, బాడీ డబుల్స్ తో పెట్టి కంప్లీట్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. సరే హీరోగారు (Star Hero) ఇండియాలో ఉండే ఆ 10 రోజులు కూడా ఏ సినిమా షూటింగ్ కి డేట్స్ ఇస్తారో ఎవరూ అంచనా వేయలేరు. అంతలా ఉంటుంది.. ఆయన ప్లానింగ్.