Khadgam: ఖడ్గంలో శ్రీకాంత్ పాత్రని ఆ హీరో వదులుకోవడానికి కారణమిదేనా..!

మన టాలీవుడ్ లో దేశ భక్తి సినిమాల లిస్ట్ తీస్తే మన అందరికీ గుర్తుకు వచ్చే సినిమా పేరు ‘ఖడ్గం’. ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించిన ఉత్తేజ్, ఈ సినిమాకి రాసిన మాటలు ఆరోజుల్లో ఒక సెన్సేషన్. కృష్ణ వంశీ దర్శకత్వ ప్రతిభ ఏమిటో తెలియాలంటే ఈ సినిమా చూస్తే అర్థం అయిపోతాది. ప్రతీ ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజు టీవీ లో ఈ సినిమా లేకుండా ఉండదు. అయితే ఈ చిత్రం గురించి అప్పట్లో జరిగిన గొడవలను అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.

ముస్లిమ్స్ మీద చాలా బోల్డ్ కామెంట్స్ చేస్తూ కనిపిస్తాడు ఈ సినిమాలో శ్రీకాంత్. ఇది చూసి అప్పట్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. థియేటర్స్ ని ద్వంసం చేసి సినిమాని కూడా చాలా చోట్ల ప్రదర్శన నిలిపివేశారు. మత గొడవలు కూడా జరిగాయి. ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్టు ని డీల్ చేసినందుకు కృష్ణ వంశీ ని మెచ్చుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇకపోతే ఈ సినిమా శ్రీకాంత్ క్యారక్టర్ హైలైట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇంత సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన అంతకు ముందు ఎప్పుడూ కూడా నటించలేదు. ఆడియన్స్ కి కూడా శ్రీకాంత్ నటన చాలా కొత్తగా అనిపించింది. ఆయనకీ మంచి పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చిపెట్టింది. అయితే ఈ పాత్రని తొలుత అక్కినేని నాగార్జున తో చేయించాలని అనుకున్నారట. కానీ కథ లో రిస్క్ కంటెంట్ ఎక్కువ ఉండడంతో నాగార్జున రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేసాడట. ఆరోజుల్లోనే ఆయన 7 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఈ (Khadgam) సినిమా కోసం డిమాండ్ చేసినట్టు సమాచారం.

సినిమా బడ్జెట్ తక్కువలో కానిచ్చేద్దాం అని అనుకుంటున్నాను, కాస్త సహకారాయించండి అని అడిగినా కూడా నాగార్జున ససేమీరా ఒప్పుకోలేదట. ఇక ఆ తర్వాత పలువురి స్టార్ హీరోల పేర్లు అనుకున్నారు కానీ, వాళ్ళు కూడా ఇదే రేంజ్ రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తుంటారని భయపడి చివరికి శ్రీకాంత్ ని తీసుకున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus