పారితోషికం ఎగ్గొట్టారు అంటూ నటీనటులు కోర్టు మెట్లు ఎక్కడం కొత్తేమీ కాదు. ఈ తంతు ఎప్పటి నుండో నడుస్తూనే ఉంది. పారితోషికం అనేవి నటీనటులకు వాయిదాల పద్దతిలో ఇస్తుంటారు. ముఖ్యంగా హీరోలకి అయితే 3 వాయిదాల రూపంలో చెల్లిస్తూ ఉంటారు. అడ్వాన్స్ రూపంలో కొంత. సగభాగం చిత్రీకరణ అయ్యాక కొంత, సినిమా కంప్లీట్ అయ్యాక కొంత ఇస్తూ ఉంటారు. హిట్టు ఫ్లాపులతో వారికి సంబంధం ఉండదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ స్టార్ హీరో తనకి నిర్మాత రూ.4 కోట్లు పారితోషికం ఎగ్గొట్టాడు అంటూ కోర్టుకెక్కాడు.
అతను మరెవరో కాదు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్. విషయంలోకి వెళ్తే..స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ లో హీరో శివకార్తికేయన్ మిస్టర్ లోకల్ అనే సినిమా చేశాడు. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. 2019లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ కు రూ.15 కోట్లు పారితోషికం ఆఫర్ చేశారట. కానీ ఇతనికి రూ.11 కోట్లు మాత్రమే చెల్లించారట.
బ్యాలన్స్ అమౌంట్ గురించి శివ కార్తికేయన్ వారిని అడగ్గా వాళ్ళు సరైన విధంగా రెస్పాన్స్ ఇవ్వలేదని తెలుస్తుంది.అందుకే ఇతను కోర్టుకెక్కాడు. ఇక్కడ రూ.15 కోట్లకి శివ కార్తికేయన్ రూ.91 లక్షల వరకు ట్యాక్స్ కట్టాడట. నిజానికి పూర్తి పారితోషం తీసుకోనప్పుడు ఆ టాక్స్ నిర్మాత చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ భారం శివ కార్తికేయన్ పై పడింది.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?