అంతరిక్షంలో ఇప్పటివరకు చాలామంది అడుగుపెట్టారు. అయితే వాళ్లంతా వ్యోమగాములు. ఆ రంగంలో నిపుణులు. అయితే తొలిసారి ఓ పౌరుడు ఈ పని చేసి చరిత్ర సృష్టించబోతున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే స్పేస్ వాక్ చేసే తొలి హీరోగా టాక్ క్రూజ్ నిలవనున్నాడు. భారీ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరైన టామ్ క్రూజ్ ఈ సాహసం చేస్తున్నాడు. దర్శకుడు డగ్ లీమన్‌తో కలసి టామ్ క్రూజ్ కొత్త సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.
ఆ సినిమాలో భాగంగానే కొన్ని దృశ్యాల చిత్రీకరణ కోసం టామ్ క్రూజ్‌ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నట్టు దర్శకుడు తెలిపారు. యూనివర్సల్ ఫిల్మ్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్ (UFEG) ఛైర్మన్ డోనా లాంగ్లీ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ‘‘టామ్ క్రూజ్ అభిమాన ప్రపంచాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్తున్నాడు’’ అంటూ సినిమా టీమ్ ఘనంగా చెప్పింది. అలా వ్యోమగాములు కాకుండా అంతరిక్షంలో స్పేస్‌వాక్ చేసిన తొలి సామాన్య పౌరుడిగా టామ్ క్రూజ్ చరిత్ర సృష్టించనున్నాడు.
అయితే అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో ఈ సినిమా సీన్స్ కొన్ని చిత్రీకరిస్తారని ఇప్పటికే వార్తలొచ్చాయి. అయితే టామ్ క్రూజ్ స్పేస్ వాక్ చేస్తాడు అని తొలిసారి వెల్లడించారు. లీమన్, టామ్ క్రూజ్ గతంలో ‘ఎడ్జ్ ఆఫ్ టుమారో’, ‘అమెరికన్ మేడ్’ లాంటి భారీ చిత్రాలు ప్రేక్షకులకు అందించారు. ఇప్పుడు కొత్త సినిమా త్వరలో రాబోతోంది. ఈ సినిమా కోసం టీమ్.. నాసా, ఎలాన్ మస్క్‌తో కలసి పని చేస్తున్నారు.
ఇప్పటివరకు ఇలా స్పేస్‌లో ఏ హాలీవుడ్ సినిమా కూడా షూటింగ్ జరుపుకోలేదు. ఇక ఈ భారీ సినిమా బడ్జెట్ సంగతి చూస్తే.. దీనికి 200 మిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నార. టామ్ క్రూజ్ ఒక్కడికే 60 మిలియన్ డాలర్లు ఇస్తున్నారట. దీంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు టామ్ ఏకంగా స్పేస్ వాక్ చేస్తున్నాడు అంటే.. ఆ అంచనాలు డబుల్ అవుతాయి. వసూళ్లు ట్రిపుల్ అవుతాయి అని చెప్పొచ్చు.