Prabhas: హీరో ప్రభాస్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..?

  • June 14, 2021 / 10:46 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ మాత్రమే అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం సినిమాను బట్టి 50 కోట్ల రూపాయల నుంచి 80 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. వరుసగా నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్టులలో ప్రభాస్ నటిస్తుండగా ప్రభాస్ తో సినిమాలను నిర్మించాలని ఆశిస్తున్న నిర్మాతల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు ప్రభాస్ తో సినిమా చేయాలని భావించి ప్రభాస్ ను సంప్రదించగా ప్రభాస్ ఏకంగా 70 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని సమాచారం.

ప్రభాస్ రెమ్యునరేషన్ భారీగా ఉండటంతో దిల్ రాజు ఈ సినిమా విషయంలో ముందుకెళ్లాలా..? వద్దా..? అని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ డిమాండ్ కు దిల్ రాజు తలొగ్గుతారో లేదో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ప్రభాస్ మాత్రమేనని చెప్పాలి. ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తే షూటింగ్ లో పాల్గొననున్నారు. సినిమాసినిమాకు ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుతుతుండటం గమనార్హం.

ప్రభాస్ తన భవిష్యత్ సినిమాలకు స్టార్ డైరెక్టర్లను, సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. పలువురు బాలీవుడ్ డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమాలు తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus