ఒక హీరోకు కథ చెప్పడానికి వస్తే నేను చేయను కానీ.. నిర్మాతను అవుతా, హీరోను కూడా నేనే సెట్ చేస్తా? అంటే.. ఏంటి ఇలాంటి హీరోలు కూడా ఉంటారా? అంటే కచ్చితంగా ఉన్నారు. అది కూడా ఎక్కడో కాదు మన టాలీవుడ్‌లో. కథ తొలుత విన్న హీరో రానా (Rana) అయితే.. ఆయన ప్రపోజ్ చేసిన హీరో నాగచైతన్య (Naga Chaitanya) . అంటే ‘మీ కథ నా కంటే మా బావకే బాగుంటుంది’అని చెప్పాడన్నమాట.
Naga Chaitanya
ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘తండేల్’ (Thandel) సినిమా తర్వాత నాగచైతన్య చేయబోయే ప్రాజెక్ట్ దాదాపు ఫిక్స్ అయింది అని అంటున్నారు. కిషోర్ అనే యువ దర్శకుడు ఆ సినిమాను హ్యాండిల్ చేయబోతున్నారట. నిజానికి కిషోర్ తొలుత రానా దగ్గరకు వెళ్లారట. కథ విన్న రానా.. ఆ కథకు తనకంటే చైతూ అయితేనే కరెక్ట్ అని చెప్పారట. దాంతో చైతుకి కథ చెప్పడం, ఓకే చేయడం వెంటవెంటనే జరిగిపోయాయట.
అంతేకాదు ఆ సినిమాకు ఒక నిర్మాతగానూ వ్యవహరిస్తానని రానా చెప్పాడట. త్వరలోనే ఈ సినిమా మొదలవుతుందని, అధికారిక ప్రకటన కూడా వస్తుంది అని చెబుతున్నారు. అయితే రానా సహ నిర్మాత మాత్రమే కాబట్టి.. పూర్తి స్థాయి నిర్మాత ఎవరు అనేది చూడాలి. నాగార్జున (Nagarjuna) తమ అన్నపూర్ణ బ్యానర్ మీద ఏమన్నా నిర్మిస్తారేమో చూడాలి. రానా ముచ్చటపడి నిర్మాత అయితే ఆ సినిమా హిట్ అనే విషయం మనకు తెలిసిందే.
ఇక చైతన్య సినిమాల సంగతి చూస్తే.. పైన చెప్పినట్లు ‘తండేల్’ పనుల్లో బిజీగా ఉన్నాడు. చందు మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుంది. కొన్నేళ్ల క్రితం అక్కడి మత్స్యాకారులను ప్రమాదవశాత్తు పాకిస్థాన్ సైన్యం అరెస్టు చేసింది. ఆ సమయంలో ఏం జరిగింది, ఎలా తిరిగి స్వదేశానికి వచ్చారు అనే విషయాల మధ్యలో ఓ చక్కటి ప్రేమకథను పొందుపరిచి తీస్తున్న చిత్రమది. ఈ సినిమాను డిసెంబరు ఆఖరున కానీ, సంక్రాంతికి కానీ తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారు.