‘ఛత్రపతి’ తర్వాత ప్రభాస్ నటించిన 5,6 సినిమాల్లో 2,3 సినిమాలు యావరేజ్ అనే లైన్ వద్దే ఆగిపోయాయి. అందులో ‘బుజ్జిగాడు’ సినిమా ఒకటి. అయితే ‘బుజ్జిగాడు’ సినిమాని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా స్పెషల్ గా చూస్తారు. ఎందుకంటే ‘బుజ్జిగాడు’ ముందు వరకు ప్రభాస్ చేసినవన్నీ సీరియస్ సబ్జెక్టులే. అయితే ‘బుజ్జిగాడు’ మాత్రం కొత్త ప్రభాస్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. పూరి జగన్నాథ్ సినిమాలో హీరోలు ఎంత సరదాగా, పవర్ ఫుల్ గా ఉంటారో..
అచ్చం ప్రభాస్ కూడా అలానే ఉంటాడు. ఓ రకంగా ప్రభాస్ కు క్రేజ్ పెరగడానికి (Bujjigadu) ఈ సినిమా బాగా హెల్పయ్యింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ యావరేజ్ ఫలితంతోనే సరిపెట్టుకుంది. అందుకు చాలా కారణాలు ఉండొచ్చు. ఈ సినిమా సమ్మర్ అయిపోయిన టైంలో రిలీజ్ అవ్వడంతో.. దక్కాల్సిన గౌరవం దక్కలేదు అన్నది కొందరి వాదన. ఆ విషయాన్ని అటుంచితే.. ‘బుజ్జిగాడు’ లో ప్రభాస్ ఎంత హైలెట్ అయ్యాడో .. అతని బావగా చేసిన మోహన్ బాబు కూడా అంతే హైలెట్ అయ్యాడని చెప్పాలి.
శివన్నగా మోహన్ బాబు ఈ సినిమా తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ పాత్రని దర్శకుడు పూరి డిజైన్ చేసిన తీరు కూడా బాగుంటుంది. ఇంకో రకంగా చెప్పాలి అంటే మోహన్ బాబు పాత్ర లేనిదే ‘బుజ్జిగాడు’ సినిమా లేదు అనే చెప్పాలి. అయితే ఈ పాత్రకి ఫస్ట్ ఛాయిస్ మోహన్ బాబు కాదు. మొదట ఈ పాత్రకి దర్శకుడు పూరి.. శ్రీహరిని అనుకున్నాడు. కాకపోతే ఆ టైంలో శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలకు కమిట్ అయ్యారు.
పైగా ‘కింగ్’ సినిమాలో కూడా హీరోయిన్ త్రిషకి శ్రీహరి అన్నయ్యగా చేస్తున్నారు. అంతకు ముందు ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలో కూడా త్రిషకి.. అన్నయ్యగా చేశారు. మళ్ళీ ‘బుజ్జిగాడు’ లో కూడా ఎందుకు.. జనాలు బోర్ ఫీలవుతారు అని కూడా శ్రీహరి.. దర్శకుడు పూరితో అన్నారట. అందుకే మోహన్ బాబుని ఫైనల్ చేశారు. మే 22 తో ‘బుజ్జిగాడు’ సినిమా రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు పూర్తయింది.