నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ‘విరాట పర్వం’ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సంపాదించుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేయలేక డిజాస్టర్ గా మిగిలింది. రానా, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల డైరెక్ట్ చేశాడు. జూన్ 17న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యింది. కానీ వారం రోజులకే అన్ని థియేటర్లలోనూ ఖాళీ అయిపోయింది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ సమర్పణలో ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలో ప్రియమణి కూడా కీలక పాత్ర పోషించింది. నిజానికి ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయమని రూ.40 కోట్ల భారీ ఆఫర్ వచ్చింది కానీ దాన్ని కాదని చెప్పి థియేట్రికల్ రిలీజ్ కు ఇంట్రెస్ట్ చూపించారు. అయితే ఈ చిత్రంలో రానా, సాయి పల్లవి ల నటన అద్భుతంగా ఉంది అని విమర్శకులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి హీరోగా మొదట రానాని అనుకోలేదట.
కేవలం సాయి పల్లవి కోసమే ఈ కథని డిజైన్ చేసుకున్నట్టు దర్శకుడు ఆ తర్వాత తెలిపాడు. అయితే మొదట ఈ కథని హీరో గోపీచంద్ కు వినిపించాడట దర్శకుడు. అయితే ఈ కథ విన్న గోపి.. ఈ కథలో ఎక్కువగా హీరోయిన్ కే ప్రాధాన్యత ఉంది. యాక్షన్ హీరో ఇమేజ్ ఉన్న గోపీచంద్ ఈ చిత్రానికి కరెక్ట్ కాదు అని ముందుగానే చెప్పేశాడట. అందుకే వేణు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
రానా నే ఇలాంటి కథ చేయొద్దంటూ చాలా మంది ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా అప్పట్లో కామెంట్స్ చేశారు. ఇక గోపి చేస్తాను అంటే ఇంకెంత ఇంకా ఎక్కువగా భయపడేవారేమో ప్రేక్షకులు. ఇదిలా ఉండగా.. జూలై 1 నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో ఈ చిత్రాన్ని వీక్షించాలని తహతహలాడుతున్నారు.