War 2: ‘వార్ 2’లోకి ఎంట్రీ ఇచ్చిన మరో స్టార్‌ హీరో.. ఇంకా ఎందరున్నారో?

‘వార్‌ 2’ (War 2) సినిమాకు సంబంధించి గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మామూలుగా అయితే ఈ హిందీ సినిమాకు కేవలం బాలీవుడ్‌లో మాత్రమే హైప్‌ ఉండేది. అయితే సినిమా టీమ్‌ తారక్‌ను  (NTR) కూడా తీసుకోవడంతో మొత్తం ఇండియా ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడే పరిస్థితి వచ్చింది. అయితే సినిమాలో ఇద్దరు స్టార్లు సరిపోరు అని టీమ్‌ అనుకుంటున్నట్లుగా ఉంది. అందుకే మూడో స్టార్‌ హీరోను కూడా తీసుకొచ్చారు.

War 2

‘వార్‌ 2’ సినిమాను యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మరో స్పైను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ‘పఠాన్‌’ అంటూ గతేడాది వచ్చి రూ.వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు అందుకున్న షారుఖ్‌ ఖాన్‌ను (Shah Rukh Khan) ‘వార్‌ 2’లో భాగం చేశారు. షారుఖ్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కూడా మొదలైందని సమాచారం. ‘పఠాన్‌’ సినిమాలో పోషించిన తరహా పాత్రలోనే షారుఖ్‌ ఖాన్‌ ‘వార్‌ 2’ సినిమాలో నటించబోతున్నాడని టాక్.

అయితే ఆ తరహా పాత్ర కాదు.. ఆ పాత్రే అని చెబుతున్నారు. ఇటీవల మొదలైన ఈ సినిమా కొత్త షెడ్యూల్‌లో షారుఖ్‌ పాల్గొన్నాడట. పాత్ర నిడివి తక్కువగా ఉన్నా.. సినిమాలో కీలక సమయంలో షారుఖ్‌ వస్తాడు అని చెబుతున్నారు. ఈ పాత్ర కోసం గతంలో సల్మాన్‌ను (Salman Khan) అనుకున్నా.. ఇప్పడున్న పరిస్థితుల్లో కష్టమని షారుఖ్‌ను తీసుకున్నారని టాక్‌.

ఐదేళ్ల క్రితం వచ్చిన ‘వార్‌’ (War) సినిమాకు సీక్వెల్‌గా ‘వార్‌ 2’ తెరకెక్కుతోంది. తొలి సినిమాలో హృతిక్‌ (Hrithik Roshan) , టైగర్‌ ష్రాప్‌ (Tiger Shroff) నటించగా.. ఇప్పుడు తారక్‌, హృతిక్‌ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా ఈ సిరీస్‌ ఇలానే కంటిన్యూ అవుతూ ‘వార్‌ 3’ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. అయితే అదెప్పుడు? ఎవరు నటిస్తారు అనేది తేలాలి అంటే ‘వార్‌ 2’ రావాలి. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న విడుదల చేస్తామని టీమ్‌ ప్రకటించింది.

బాలయ్యతోనే మళ్ళీ ఆ ఇద్దరు.. క్రేజీ కాంబినేషన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus