సూర్య సేతుపతి తండ్రి పేరు నిలబెట్టగలడా.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ పెద్ద కొత్తెం కాదు.. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు స్టార్ హీరోల వారసులు . తాజాగా ఆ లిస్టు లోకి యాడ్ అయిపోయాడు మరో స్టార్ హీరో కొడుకు. ఇతను మరెవరో కాదు పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఉన్న తమిళ నటుడు, హీరో విజయ్ సేతుపతి కుమారుడు సూర్య హీరోగా పరిచయం కాబోతోన్నాడు.

సూర్య సేతుపతి తాజాగా హీరోగా ఎంట్రీ ఇస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు . ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . తమిళం – హిందీ – తెలుగు – మలయాళం భాషలలో అద్భుతమైన సినిమాలు చేసి స్టార్ గా ఎదిగిన విజయ్ సేతుపతి కి ఇద్దరు పిల్లలు సూర్య – శ్రీజ. సూర్య ఇప్పటికే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు .

ఇప్పటికే నటన డాన్స్ ఫైట్స్ లో పూర్తిస్థాయి శిక్షణ తీసుకున్నారు . సూర్య సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫీనిక్స్ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో శుక్రవారం జరిగాయి . ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ తోనే అభిమానులను బాగా ఆకట్టుకునేసాడు ఈ సూర్య సేతుపతి.

ఫైట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వంలో హీరోగా చేస్తున్నాడు (Surya Sethupathi) సూర్య. అనల్ అరసుకు కూడా దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. ఈ సినిమా పేరు ఫీనిక్స్. యాక్షన్, స్పోర్ట్స్, డ్రామా… ఇలా అనేక ఎలిమెంట్లతో ఈ చిత్రం ఉండబోతోందట. ఈ చిత్రాన్ని బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Airport Diaries Update. Get Filmy News LIVE Updates on FilmyFocus