ఆ సూపర్ హిట్ రీమేక్ లో నటించే స్టార్స్ ఎవరు.. మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలు..!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పన్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యడనికి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు రెడీ అయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేసారు. గత కొద్ది రోజులుగా ఈ రీమేక్ పై చర్చ జరుగుతూనే ఉంది. మల్టీ స్టారర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో హీరోలు వీరేనంటూ కొంతమంది స్టార్ల పేర్లు వినిపించాయి. అయితే బాలకృష్ణ,రానా కలిసి ఈ రీమేక్ లో నటించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

రానా ఈ ప్రాజెక్ట్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అయితే బాలయ్య మాత్రం ఈ ప్రాజెక్ట్ చెయ్యడం లేదని తన పుట్టిన రోజునాడు క్లారిటీ ఇచ్చాడు. దీనితో బాలయ్య ప్లేస్ లో రవితేజ చెయ్యబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే రవితేజ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ ను ఆగష్ట్ నుండీ ప్రారంభించనున్నట్టు ప్రచారమైతే జరుగుతుంది. ఇక ఇప్పుడు మరో వార్త హల్ చేస్తుంది. ఈ చిత్రంలో బిజూ పాత్రని వెంకటేష్ చేస్తున్నాడని టాక్ నడుస్తుంది.

అంటే రవితేజ నో చెప్పాడా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.ఇక ‘సురేష్ ప్రొడక్షన్స్’ మరియు ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లు కలిసి నిర్మించబోతున్న చిత్రంలో వెంకటేష్, రానా లు కలిసి నటించినా దగ్గుబాటి అభిమానులకు అలాగే సినీ ప్రియులకు సంతోషకరమైన వార్త అనే చెప్పాలి. మరి దీనికి సంబందించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus