వయస్సు పెరుగుతున్నా ఈ స్టార్ హీరోలు తగ్గట్లేదుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకున్న చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఆరు పదుల వయస్సులో కూడా ఈ హీరోలు వరుసగా సినిమాలలో నటిస్తూ సత్తా చాటుతున్నారు. ప్రేక్షకులను మెప్పించడం కోసం ఈ స్టార్ హీరోలు ఎంతో కష్టమైన ఫైట్లు చేస్తూ ప్రేక్షకుల ప్రశంసలను సొంతం చేసుకుంటున్నారు. ఈ హీరోలు ఈ విషయంలో నిజంగా గ్రేట్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వయస్సు పెరుగుతున్నా స్టార్ హీరోలు అస్సలు తగ్గడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యంగ్ జనరేషన్ స్టార్ హీరోలతో పోల్చి చూస్తే సీనియర్ స్టార్ హీరోలే వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. ఈ హీరోల పారితోషికాలు పరిమితంగానే ఉండటంతో పాటు ఈ హీరోల సినిమాల బడ్జెట్లు కూడా తక్కువ కావడంతో సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా నిర్మాతలకు నష్టాలు అయితే రావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలలో నటిస్తుండగా ఈ మూడు సినిమాలపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

రాబోయే 12 నెలల్లో ఈ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి స్థాయి స్పీడ్ లో మరే హీరో నటించడం లేదు. మరో స్టార్ హీరో బాలకృష్ణ అఖండ సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకోగా ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో జై బాలయ్య సినిమాలో నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ నారప్ప, దృశ్యం2, ఎఫ్3 సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకోగా ఈ సినిమాలలో రెండు సినిమాలు ఓటీటీలో విడుదలైతే ఎఫ్3 మాత్రం థియేటర్లలో విడుదలై సక్సెస్ ను సొంతం చేసుకుంది.

మరో హీరో నాగార్జున సైతం బంగార్రాజు సినిమాతో భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. వెంకీ, నాగ్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. కొన్ని విషయాలలో సీనియర్ స్టార్ హీరోలకు యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు సైతం పోటీ ఇవ్వలేరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus