ప్రస్తుత సినిమాలలో హీరోలతో పోటీగా విలన్లు నటించడమే కాకుండా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు విలన్ పాత్రలో నటించడం కోసమే కొందరు నటులు ఉండేవారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఒక సినిమాలో హీరోగా చేస్తూనే మరో సినిమాలో విలన్ గా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇప్పటికే జగపతిబాబు, శ్రీకాంత్, అరవింద్ స్వామి వంటి సీనియర్ నటులు విలన్ గా మారి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే యంగ్ హీరోల విషయానికి వస్తే ఆది పినిశెట్టి సైతం హీరోగా విలన్ గా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేయగా తాజాగా మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్, సూర్య వంటి వాళ్లు సైతం విలన్ పాత్రలో నటించి మెప్పించారు.
అయితే విలన్ పాత్రల్లో నటించాలని హీరోలతో పాటు రెస్పెక్ట్ కూడా ఎంతో ముఖ్యమని డిమాండ్ చేస్తున్నారు. పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటించిన ఈయన పుష్ప కేవలం సర్ అని గౌరవం ఇవ్వలేదంటూ వీరి మధ్యన వైరం మొదలయ్యి ఈ సినిమా సీక్వెల్ వరకు దారి తీసింది. తనకు ఒకటి తక్కువైందంటూ సర్ అనే రెస్పెక్ట్ కావాలని డిమాండ్ చేశాడు. తాజాగా విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో నటించిన సూర్య సైతం విలన్ పాత్రలో ప్రేక్షకులను సందడి చేశారు.
రోలెక్స్ కూడా ఈ సినిమాలో నటించినందుకు రెస్పెక్ట్ కావాలని కోరుకున్నారు.తన దగ్గర పనిచేసే మనుషులే తనని పేరు పెట్టి పిలవడం జీర్ణించుకోలేక పోయిన సూర్య తనకు సర్ అనే రెస్పెక్ట్ కావాలని కోరుకున్నారు. అందుకే తనని రోలెక్స్ సర్ అని పిలవాలని పట్టుబడ్డారు. ఈ సీన్ కూడా సినిమాకి మరింత హైలెట్ అయ్యింది.ఈ విధంగా ప్రస్తుత కాలంలో స్టార్ హీరోలు విలన్ పాత్రలో నటిస్తూ వారికి రెస్పెక్ట్ కావాలనే కొత్త కండిషన్ పెడుతున్నారు.
హీరోలతో పాటు విలన్లు రెమ్యునరేషన్ తీసుకోవడమే కాకుండా వారికి రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి కండీషన్ అప్లై చేసినట్టు తెలుస్తుంది.ఒకప్పుడు సినిమాలలో పెద్ద పెద్ద మీసాలు గడ్డం పెంచుకుని విలన్లు చూడటానికే భయంకరంగా ఉండేవారు. అప్పట్లో విలన్ లను హీరోలు ఎలా పిలిచిన పడేవారు. ప్రస్తుతం విలన్లు కూడా తమకు రెస్పెక్ట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుత కాలంలో యంగ్ హీరోలు సైతం విలన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటే నటించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.