అందలం ఎక్కాలనుకొని అభాసుపాలవుతున్నారు!

  • June 18, 2018 / 07:00 AM IST

ఒక పద్ధతి ప్రకారం ఎదగడానికి, ఏదో ఒకలా ఎదగడానికి చాలా తేడా ఉంటుంది. చాలా తక్కువ మంది ఒక పద్ధతి ప్రకారం ఎదగాలనుకొంటే.. ఎక్కువశాతం మంది మాత్రం పద్ధతులనేవి ఏమాత్రం ఫాలో అవ్వకుండా అడ్డదారుల్లో పైకి ఎదగాలి అనుకొంటారు. హీరోయిన్లు మాత్రమే కాదు స్టార్ స్టేటస్ కోసం అడ్డదార్లు తోక్కే హీరోలు, దర్శకులు ఎందరో. అయితే.. అమ్మాయి మీద అబాండాలు వేయడం సులువు గనుక అమ్మాయిల పేర్లు మాత్రం చాలా ఈజీగా బయటకి వచ్చేస్తుంటాయి. ఇది కేవలం మొన్నటి ఫారిన్ సెక్స్ రాకెట్ ఇష్యూ మాత్రమే కాదు. ఇంతకుమునుపు జరిగిన ఈ తరహా వ్యవహారాల్లోనూ హీరోయిన్స్ పేర్లు మాత్రమే బయటకి వచ్చాయి తప్ప వాళ్ళ వెనుక ఉన్నది ఎవరు అనేది మాత్రం అస్సలు తెలియలేదు. ఈ తాజా సెక్స్ రాకెట్ విషయంలోనూ అంతే.. కొందరు యాంకర్లు, హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ పేర్లలో ఎన్ని కరెక్ట్, ఎన్ని ఫేక్ అనే విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ.. ఆల్రెడీ పేర్లు వినిపిస్తున్నవాళ్లు ఆన్ లైన్ లో అనవసరంగా అభాసుపాలవుతున్నారు.

అయితే.. అసలు ఈ గోలంతా ఎందుకు. హ్యాపీగా సినిమాల్లో యాక్ట్ చేస్తూ.. స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తూ.. సరైన పద్ధతిలో డబ్బులు సంపాదించక ఈ అడ్డదారుల్లో ఒళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితికి ఎందుకు దిగజారుతున్నారు అనేది మాత్రం అంతుచిక్కని ప్రశ్న. వ్యక్తిత్వం అనేది వదిలేశారు సరే కనీసం దొరికిపోతామేమోనన్న భయం లేకుండా ఇంత ధైర్యంగా ఈ పనులన్నీ ఎలా చేస్తున్నారు అనేది ఎవరికీ అర్ధం కానీ విషయం. అయితే.. ఈ తరహా కార్యకలాపాల్లో పాల్గొనేవారికి రాజకీయ పరంగాను మద్దత్తు ఉంటుండడంతో.. ఇక వాళ్ళ కక్కుర్తి పనులకి అడ్డూ ఆపూ లేకుండాపోతోంది. కానీ.. ఎన్నాళ్ళిలా.. కష్టపడి సంపాదించుకొన్న పేరు మొత్తం కేవలం ఒకే ఒక్క కేస్ తో పోతే.. ఇంకెందుకు ఈ బ్రతుకు. ఈ విషయాన్ని ఎప్పటికీ తెలుసుకొంటారు. ఓ నాలుగైదు గంటలు శరీరం నాది కాదు అనుకొని లక్షలు సంపాదిస్తున్నారు సరే.. భవిష్యత్ తరాలకి ఏం సమాధానం ఇద్దామనుకొంటున్నారు.

రేపన్న రోజున కొత్త జీవితాలు మొదలెడదామన్నా కూడా సుఖంగా జీవించగలరా. ఎందుకని ఈ లాజిక్ ని మర్చిపోతున్నారు. డబ్బు కంటే ముఖ్యమైనవి జీవితంలో చాలా ఉన్నాయనే విషయం ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడే ఈ విధంగా డబ్బు, ఫాల్స్ స్టేటస్ సంపాదించాలనుకొనే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. లేదంటే హీరోయిన్స్ కి వేశ్యాలకి పెద్ద తేడా లేకుండాపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus