సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ గీత రచయిత అయినటువంటి కులశేఖర్ (Kulasekhar) ఈరోజు అనగా నవంబర్ 26 మంగళవారం నాడు మృతి చెందారు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు మాత్రమే.కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన ఇటీవల హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే పరిస్థితి విషమించడం చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది. దర్శకుడు తేజ (Teja) టాలీవుడ్ కి పరిచయం చేసిన వారిలో కులశేఖర్ ఒకరు.
‘చిత్రం’ (Chitram) ‘జయం’ (Jayam) సినిమాలతో గేయ రచయితగా కెరీర్ ను ప్రారంభించారు కులశేఖర్. ఆ తర్వాత ‘రామ్మా చిలకమ్మా’ ‘ఘర్షణ’ (Gharshana) ‘వసంతం’ (Vasantam) ‘నువ్వు నేను’ (Nuvvu Nenu) ‘మృగరాజు’ (Mrugaraju) వంటి సినిమాలకు పనిచేశారు. కులశేఖర్ పూర్తి పేరు తిరుమల పల్లెర్లమూడి కులశేఖర్. గతంలో ఆయన ఓ పాట విషయంలో కాంట్రోవర్సీలో చిక్కుకున్నారు. ఆయన బ్రహ్మిన్ అయ్యుండి ఒక పాటలో బ్రాహ్మణ కులస్థుల మనోభావాలు దెబ్బతినేలా లిరిక్స్ రాసారని.. వీరి కులస్థులు వెలివేశారు. అంతకు ముందే భార్య కూడా ఇతన్ని వదిలేసింది.
ఓ సందర్భంలో ఇతను దొంగతనాలు చేసి పోలీసులకి పట్టుబడ్డాడు. తర్వాత జైలుకు వెళ్లడం కూడా జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఇతను 6 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. 2008 నుండి ఇతను మెదడుకి సంబంధించిన ఒక వ్యాధితో బాధపడుతూ వస్తున్నాడట. దాని కారణంగానే జ్ఞాపకశక్తి కోల్పోవడంతో పాటు.. మానసికంగా కూడా ఇబ్బంది పడుతూ వచ్చాడట. చివరికి ఇలా జరిగింది. ఇక కులశేఖర్ మరణవార్త తెలిసిన కొందరు సెలబ్రిటీలు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.