డిసెంబర్ సెంటిమెంట్ ను థమన్ కొనసాగిస్తారా?

  • December 1, 2021 / 05:39 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ కూడా ఒకరనే సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న థమన్ మ్యూజిక్ అందించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధిస్తున్నాయి. థమన్ మ్యూజిక్ అందించిన అఖండ సినిమా రేపు థియేటర్లలో రిలీజ్ కానుండగా థమన్ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా హిట్టేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత రెండేళ్లలో థమన్ మ్యూజిక్ అందించి డిసెంబర్ లో రిలీజైన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

2019 సంవత్సరం డిసెంబర్ నెలలో థమన్ సంగీతం అందించిన వెంకీమామ సినిమా, ప్రతిరోజూ పండగే సినిమా విడుదలయ్యాయి. కొన్నిరోజుల గ్యాప్ తో విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. థమన్ సంగీతం అందించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా గతేడాది విడుదలైంది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అఖండ సినిమాతో థమన్ సక్సెస్ సెంటిమెంట్ ను కొనసాగిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ సినిమాకు 55 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ రోల్ లో నటించారు. ఈ సినిమా సెకండాఫ్ లో బాలయ్య అఘోరా పాత్రకు సంబంధించిన సీన్స్ ఉంటాయని ఆ సీన్స్ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేలా ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో అఖండ సినిమా ఫలితం తేలనుంది. ఈ సినిమా సక్సెస్ సాధించాలని బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus