Pawan Kalyan, Venkatesh: వెంకీతో పాటు పవన్ తో కూడా మరోసారి!

1998 లో వెంకటేష్  (Venkatesh) హీరోగా వచ్చిన ‘ప్రేమంటే ఇదేరా’ (Premante Idera) సినిమాతో సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు రమణ గోగుల (Ramana Gogula) . ఆ సినిమా పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సినిమా కూడా బాగా ఆడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘తమ్ముడు’ (Thammudu) ‘బద్రి’ (Badri) , మహేష్ బాబు (Mahesh Babu) ‘యువరాజు’ (Yuvaraju) , వంటి హిట్ సినిమాలకి కూడా పనిచేశాడు రమణ గోగుల. అయితే పవన్ కళ్యాణ్ తో ఇతను ఎక్కువ సినిమాలకి పనిచేశాడు.

Venkatesh

పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి రమణ గోగుల పెక్యులర్ వాయిస్ కరెక్ట్ గా సరిపోయేది. అందుకే రమణ గోగులకి ‘జానీ’ (Johnny) ‘అన్నవరం’ (Annavaram) వంటి సినిమాలకు కూడా పనిచేసే ఛాన్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. తర్వాత వీరి కాంబోకి బ్రేక్ పడింది. వెంకటేష్ తో కూడా ‘లక్ష్మీ’ (Lakshmi) సినిమాకి పనిచేశారు రమణ. వీరిది కూడా హిట్టు కాంబినేషన్.

అయితే ఎందుకో తర్వాత వీరి కాంబో కూడా సెట్ అవ్వలేదు.మొత్తానికి 18 ఏళ్ళ తర్వాత వెంకటేష్ నటిస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’  (Sankranthiki Vasthunnam)  సినిమాలో ఓ పాట పాడబోతున్నాడు రమణ గోగుల. భీమ్స్ (Bheems Ceciroleo) ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మరోపక్క పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓజి’ (OG Movie)  సినిమాలో కూడా ఓ పాట పాడబోతున్నాడట రమణ గోగుల.

తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.2025 స్టార్టింగ్లో రమణ గోగుల ఓజీలో పాడిన పాట బయటకు రానుందని సమాచారం. సో 18 ఏళ్ళ తర్వాత వెంకీ సినిమాలో, 19 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలో పాటలు పాడబోతున్నాడు రమణ గోగుల అని చెప్పాలి. మరి ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలు అందుకుంటాయో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus