The Rajasaab: రాజా సాబ్‌.. చిన్న సినిమా కాదంటున్న నిర్మాత.. ఊహించనంత భారీగా..!

  • November 12, 2024 / 12:56 PM IST

‘బాహుబలి’ (Baahubali) సినిమాల సమయంలోనే ‘సాహో’ (Saaho) , ‘రాధేశ్యామ్‌’ (Radhe Shyam) సినిమాల కథలను ఓకే చేశాడు. ‘బాహుబలి’ (Prabhas)  సినిమాల విజయం తర్వాత ఆ సినిమాల స్థాయి కూడా పెరిగిపోయింది. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కాస్త పాన్‌ ఇండియా రెబల్‌ స్టార్‌ కావడమే దానికి కారణం. అయితే ఆ సినిమా ఫలితాలు ఆశించిన మేర రాలేదు. స్కోప్‌ లేని కథలను భారీ చిత్రాలుగా మలిచారు అనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు ఎందుకు ఆ చర్చ అనుకుంటున్నారా?

The Rajasaab

ప్రభాస్‌ లైనప్‌లో చిన్న సినిమాగా ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వస్తున్న ‘ది రాజా సాబ్‌’  (The Rajasaab) కూడా ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయి పెద్ద సినిమాగా మార్చేశారు. ఈ మాట చెప్పింది ఆ సినిమా నిర్మాతే. దర్శకుడు మారుతి (Maruthi Dasari) ఇప్పటిదాకా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే తీశారు. అలాంటి దర్శకుడితో ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ సినిమా ఓకే చేయడంతో ఇది చిన్న సినిమానే అని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉద్యమాలు చేశారు.

కానీ ఇప్పుడు చూస్తే ‘రాజా సాబ్’ సినిమాను భారీ సినిమాగానే పరిగణించాలి అని అంటున్నారు. భారీ సినిమాల మధ్య ఆటవిడుపుగా ఈ సినిమాను ప్రభాస్‌ చేయడం లేదని.. ఆ సినిమాల స్థాయిలోనిదే ఈ సినిమా కూడా అని అంటున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ (T. G. Vishwa Prasad) . ‘రాజా సాబ్’ సినిమా గురించి పరిమితంగానే చెప్పగలను అని.. కానీ ఈ సినిమా స్థాయి వేరు అని చెప్పింది. కథ పరంగా ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుందని చెప్పారు.

ప్రభాస్‌ సినిమాల్లో వేరే స్కేల్‌లో ఉండే ప్రాజెక్ట్‌ ఇది. సినిమా కథ స్పాన్ చాలా పెద్దది. సెట్స్, వీఎఫెక్స్ అన్నీ భారీగానే ఉంటాయి. వాటికితోడు ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌. ఇంతవరకు ప్రపంచ సినిమాలో తీయనంత లెవెల్లో ఈ చిత్రంలో హారర్ ఉంటుంది అని కూడా చెప్పారాయన. ఆ లెక్కన ఈ సినిమాకు భారీ పాన్‌ ఇండియా హారర్‌ కామెడీ అనొచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus