టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల బ్రో సినిమాతో ఇండ్రస్ట్రీ హిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలు చేస్తూనే, మరోపక్క సినిమాలు కూడా చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. క్షణం తీరిక లేకుండా ఆయన గడుపుతున్న విధానం ని చూసి అభిమానులు అయ్యో పాపం అని అనుకుంటున్నారు. అయితే అక్టోబర్ నెల నుండి పవన్ కళ్యాణ్ తన సినిమాల షూటింగ్స్ మొత్తానికి బ్రేక్ ఇచ్చి కేవలం క్రియాశీలక రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ మరియు ‘హరి హర వీరమల్లు’ చిత్రాలు ఆగిపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆయన తన ఫోకస్ పూర్తి స్థాయిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు ‘ఓజీ’ చిత్రాలపైనే పెట్టాడు. అప్పుడెప్పుడో వకీల్ సాబ్ సినిమా సమయం లో ప్రారంభించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని అసలు పట్టించుకోవడం లేదు.
దీనిపై డైరెక్టర్ క్రిష్ చాలా నిరాశ లో ఉన్నాడు. నిర్మాత ఎ.యం రత్నం మరియు క్రిష్ పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా షెడ్యూల్స్ గురించి చర్చలు జరపడానికి అనేకసార్లు ప్రయత్నం చేసినా, పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. దీంతో ఏఎం రత్నం తీవ్రమైన అసహనం లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఫైనాన్షియర్స్ నుండి 80 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసి ‘హరి హర వీరమల్లు‘ షూటింగ్ ని 60 శాతం కి పైగా పూర్తి చేసారు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) షెడ్యూల్స్ మరియు డేట్స్ విషయం లో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే, సినిమాని పూర్తి స్థాయిలో ఆపేయాల్సి వస్తుంది. అలా జరిగితే నిర్మాత రత్నం కి తీరని నష్టం జరుగుతుంది. అందుకే ఏప్రిల్ నెల లోపు డేట్స్ సర్దుబాటు విషయం లో ఎదో ఒక విషయం తేల్చకపోతే, పెట్టిన 80 కోట్ల రూపాయిల బడ్జెట్ వడ్డీ తో సహా కట్టాలని పవన్ కళ్యాణ్ ని డిమాండ్ చేస్తున్నట్టుగా ఫిలిం నగర్ లో ఒక వార్త వినిపిస్తుంది.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!