లెక్కలేనన్ని ఎఫైర్లు.. విడాకులకు రెడీ అయిన నిర్మాత భార్య!

కమల్ ఆర్ ఖాన్.. అలియాస్ కె.ఆర్.కె.. ఇతనికి… టాలీవుడ్ కు సంబంధం లేదు. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్’ వంటి పాన్ ఇండియా సినిమాల వల్ల.. ఇతను తెలుగులో కూడా ఫేమస్ అయ్యాడు. ఎలా అంటే.. ఆ సినిమాలు చెత్త సినిమాలు అని.. ఆ సినిమాల దర్శకులు అయిన రాజమౌళి, ప్రశాంత్ నీల్ …లను జైల్లో పెట్టాలి అంటూ ఇష్టమొచ్చిన కామెంట్లు చేశాడు. ఈ విషయాల్లో ట్రోల్ అయినా ఇతను ఏమాత్రం మారడు.

ఎప్పుడూ ఏదోక వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉంటాడు.కొన్ని బాలీవుడ్ సినిమాలు రిలీజ్ కాకుండానే వాటి కథ ఇతని.. ఆ సినిమాలు ప్లాప్ అవుతాయని ట్వీట్లు వేస్తుంటాడు. ఒక వేళ ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే కనుక .. కలెక్షన్లు లేవు అంటాడు. ఒకవేళ సినిమా ప్లాప్ అయితే ఆ హీరోకి ముందే చెప్పాను.. కానీ నేను చెప్పింది చేయలేదు అంటూ ఉంటాడు. అవన్నీ ఎలా ఉన్నా.. తాజాగా ఇతను ఓ నిర్మాత గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

కె.ఆర్.కె తన ట్విట్టర్ ద్వారా… ‘ ‘బ్రేకింగ్ ఓ అగ్ర నిర్మాత భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.ఆమె ప్రస్తుతం ఓ హోటల్‌లో ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణం నిర్మాత అయిన ఆమె భర్త లెక్కలేనన్ని ఎఫైర్లు పెట్టుకోవడం వల్లే. త్వరలోనే ఆ నిర్మాతకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అవుతోంది” అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. ఆ నిర్మాత ఎవరు? పోనీ అతని భార్య పేరు కానీ అతను చెప్పలేదు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఆత్రం ఎక్కువైన నెటిజన్లు.. సోషల్ మీడియాలో రకరకాల పేర్లు కామెంట్లుగా పెడుతున్నారు. ఇందువల్ల ఈ పోస్ట్ వైరల్ గా మారింది. కె.ఆర్.కె గురించి తెలిసిన వాళ్ళు ‘దీనిని అతను టైం పాస్ కోసం వేసిన పోస్ట్’ గా భావిస్తున్నారు. రూమర్లకు బాలీవుడ్ అనేది పెద్ద అడ్డా. కె.ఆర్.కె లాంటి వాళ్ళు అక్కడ సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు అంటే దానికి కారణం ఇదే..!

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus