Samantha: సామ్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన స్టార్ ప్రొడ్యూసర్.. ఏం జరిగిందంటే?

స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా శాకుంతలం సినిమా సమంత కోరుకున్న విజయాన్ని కచ్చితంగా అందిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. 80 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తీశామని 81 రోజుల్లో ఈ సినిమా షూట్ జరిగిందని సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయల విలువైన ఒరిజినల్ బంగారు నగలను చేయించారని బోగట్టా. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్హ కీలక పాత్ర పోషించగా తాజాగా సమంతకు షాక్ తగిలింది.

డ్రీమ్ వారియర్స్ బ్యానర్ పై సమంత (Samantha) హీరోయిన్ గా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఆమె స్థానంలో రష్మిక చేరింది. రెయిన్ బో అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సమంతను ఈ సినిమా నుంచి తప్పించడం గురించి నిర్మాత మాట్లాడుతూ స్క్రిప్ట్ కు ఎవరు సరిపోతారో వాళ్లనే ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. ఆ ఫ్లోను మేము మార్చాలని భావించడం లేదని నిర్మాత చెప్పుకొచ్చారు. కర్మ, కంటెంట్ అలా జరుగుతూ వెళుతుంటాయని వాటిని ఎవరూ మార్చలేరని ఆయన తెలిపారు.

నిర్మాత ప్రభు వెల్లడించిన విషయాలు సమంత అభిమానులను అసహనానికి గురి చేస్తున్నాయి. మయోసైటిస్ వల్ల సమంత సినిమాల షూటింగ్ లు వాయిదా పడటం వల్లే ఈ విధంగా జరిగిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి తప్పుకోవడంపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ మూవీ సక్సెస్ సాధిస్తే రష్మిక మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీ అయ్యే ఛాన్స్ ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రష్మిక చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. పుష్ప2 సినిమాతో రష్మిక ఖాతాలో మరో ఇండస్ట్రీ హిట్ చేరుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus