సినీ పరిశ్రమని వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2022 సెకండాఫ్ లో చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. ఆ లిస్ట్ చాలా పెద్దదే. అయితే గత 4 నెలల్లో కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి దిగ్గజాలను కోల్పోయింది టాలీవుడ్.తెలుగులో అనే కాదు ఇతర ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కూడా చాలా మంది మరణించారు. వల్లభనేని జనార్దన్ మరణవార్తతో షాక్ కు గురైన సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకముందే…
ఇంకో నిర్మాత కూడా ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అయిన నితిన్ మన్మోహన్ తాజాగా గుండెపోటుతో మరణించారు. కొన్నాళ్లుగా గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. డిసెంబర్ 3న ఆయనకు గుండెపోటు రావడంతో ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారట. అప్పటి నుండి ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారట. అయితే పరిస్థితి విషమించడంతో ఉదయం కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఆయన కుతూరు ఈ చేదు వార్తను తెలియజేసింది.
‘గత 3 వారాల నుంచి ఆస్పత్రిలో ఉన్న నాన్నగారు.. ఈ రోజు ఉదయం కన్నుమూశారు’ అంటూ తెలిపారు. తండ్రి అనారోగ్యం పాలవడంతో దుబాయిలో జాబ్ చేస్తున్న నితిన్ కొడుకు కూడా.. కొద్ది రోజుల క్రితం స్వదేశానికి వచ్చేశాడట. 1986లో ‘బాత్ బన్ జాయే’ సినిమాతో నిర్మాతగా మారిన నితిన్ మన్మోహన్.. ‘బోల్ రాధా బోల్’ (1992), ‘ఆర్మీ’ (1996), ‘షూల్’ (1999), ‘లవ్ కే లియే కుచ్ బి కరేగా’ (2001), ‘దస్’ (2005), ‘యమ్లా పగ్లా దీవానా’ (2011), ‘రెడీ’ (2011) లాంటి సినిమాలను కూడా నిర్మించారు.