సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మేనమామ,ప్రముఖ నిర్మాత అయిన మురళీరాజు మృతి చెందారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం నాడు ఉదయం కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్లోని భీమవరంకి చెందిన మురళి రాజు గతంలో నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. అలాగే పలు వ్యాపారాలు కూడా చేస్తూ వచ్చారు. ఈయనకు ఇద్దరు సంతానం.మురళి రాజుకు ఓ కుమారుడు మంతెన మధు, ఓ కుమార్తె అంబికా.

కుమారుడు మధు గజిని వంటి సినిమా తో పాటు తెలుగు, హింది,తమిళ భాషలలో 34 సినిమాలకు పైగా సినిమాలను నిర్మించడం జరిగింది. ఇక మురళీ రాజు పార్థీవ దేహాన్ని సందర్శించడం కోసం గాను నిర్మాత అల్లు అరవింద్, స్టార్ హీరో అల్లు అర్జున్, నిర్మాత బన్నీ వాసు తదితరులు,మధురానగర్ లోని మురళి రాజు నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ముంబై నుండి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించటానికి విచ్చేసారు.

ఇక మురళీ రాజు మృతికి చింతిస్తూ కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. గతేడాది జూన్ నుండీ సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది నటీనటులు, నిర్మాతలు , దర్శకులు మృతి చెందడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో అయితే తారకరత్న, కళాతపస్వి కె విశ్వనాథ్, ఆయన భార్య జయలక్ష్మి, దర్శకుడు సాగర్ వంటి వారు కూడా మరణించిన సంగతి తెలిసిందే.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus