నందమూరి తారకరత్న ..దివంగత స్టార్ హీరో. నందమూరి తారక రామారావు గారి కొడుకులలో ఒకరైన మోహన కృష్ణ గారి అబ్బాయి. బాబాయ్ బాలకృష్ణ గారి స్ఫూర్తితో ఇతను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇతని సినీ ఎంట్రీ ఎంతో వైభవంగా స్టార్ట్ అయ్యింది. ఒకే రోజు 9 సినిమాలను అనౌన్స్ చేసి .. పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి చరిత్ర సృష్టించాడు తారకరత్న. ఇప్పటికీ ఆ రికార్డు.. అలాగే ఉంది. అయితే తారకరత్న సినీ కెరీర్ మాత్రం అంత వైభవంగా సాగలేదు.
తారకరత్న హీరోగా మొదలైన మొదటి చిత్రం యువరత్న. ఈ సినిమాని రామకృష్ణ హార్టి కల్చర్ సినీ స్టూడియోస్ బ్యానర్ నందమూరి రామకృష్ణ నిర్మించారు. ఇది సొంత బ్యానర్ లో చేసిన మూవీ. అయితే ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది.ఉప్పలపాటి నారాయణరావు ఈ చిత్రానికి దర్శకుడు. అయితే ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తారకరత్న మొదటి సినిమాగా రిలీజ్ అయ్యింది. అశ్వినీ దత్, రాఘవేంద్ర రావు, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం బాగానే ఆడింది.
దీంతో యువరత్న చిత్రాన్ని రిలీజ్ చేశారు. అది ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత తారకరత్న చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూనే వచ్చాయి. మొదట తారకరత్న అనౌన్స్ చేసిన సినిమాల్లో కొన్ని సగం షూటింగ్ జరుపుకుని ఆగిపోయాయి. ఇంకొన్ని సినిమాలు అయితే ఆర్థిక లావాదేవీల కారణంగా అసలు సెట్స్ పైకి వెళ్ళలేదు.
ఇక తారకరత్న చేసిన భద్రాద్రి రాముడు, నొ వంటి సినిమాలు రిలీజ్ అవ్వడానికే చాలా సమస్యలు ఎదుర్కొన్నాయి. ఈ సినిమాల ఫలితాలను చూపించి, కొంతమంది నిర్మాతలు తారకరత్న తో చేసిన సినిమాలకు పారితోషికాలు ఎగ్గొట్టారట. ఆ సినిమాలకు తారకరత్న అడ్వాన్స్ లతోనే సరిపెట్టుకున్నట్టు తెలుస్తుంది.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?