కొడుకు, రెండో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన పాపులర్ సింగర్..!

  • March 14, 2023 / 02:22 PM IST

సినిమా వాళ్లంటే పాపులారిటీ, సెలబ్రిటీ స్టేటస్ వల్ల కాస్త స్పెషల్‌గా కనిపిస్తారు కానీ వారికుండే కష్టాలు వారికుంటాయి.. చాలా మంది తమ పర్సనల్ లైఫ్ గురించి బయటకు చెప్పడానికి ఇష్టపడరు.. అయితే.. కెరీర్ పరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా స్టార్ సింగర్‌గా ఎదిగి.. పెళ్లి చేసుకుని.. ప్రొఫెషనల్ లైఫ్ సాగినంత సాఫీగా పర్సనల్ లైఫ్ సాగకపోవడం.. అన్నీ తానే అనుకున్న భర్త అర్థాంతరంగా వదిలేేసి వెళ్లిపోవడం.. కొడుకు బాధ్యతలు చూసుకుంటూ జీవితంతో పోరాడుతూ వచ్చారు పాపులర్ సింగర్ కౌసల్య..

కౌసల్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.. ‘మల్లి కూయవే గువ్వా.. మోగిన అందెల మువ్వా’, ‘ఈ రోజే తెలిసిందీ నీలో దాగిన ప్రేమ’, ‘రా రమ్మని రారా రమ్మని రామ చిలుక పిలిచేను ఈవేళా’, ‘కొంచెం కారంగా, కొంచెం గారంగా’అంటూ తన మధురమైన గాత్రంతో అద్భుతమైన పాటలు పాడారామె.. ముఖ్యంగా సంగీత దర్శకుడు చక్రి కంపోజిషన్‌లో పాడిన పాటలు మంచి గుర్తింపు తెచ్చాయి..1999 లో రవితేజ ‘నీకోసం’ సినిమాతో కౌసల్య కెరీర్ మొదలైంది..

దాదాపు 350కి పైగా పాటలు పాడారు.. కట్ చేస్తే.. ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అనుకున్నంత సజావుగా సాగలేదు.. భర్త వేధింపులు తట్టుకోలేక పలుమార్లు కేసులు కూడా పెట్టారు.. ఇటీవల ఓ ఇంటర్వూలో పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారామె.. భర్త వేధించినా.. తన కుమారుడి కోసం అతడితో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నానని, కానీ చివరికీ తన భర్తే తనను వదిలేసి, మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందని చెప్పారు.

ఇప్పుడు తన కుమారుడు ఎదిగాడని, ఇప్పుడు అతడెంతో ప్రేమగా చూసుకుంటున్నాడని తెలిపారు. అదేవిధంగా ఓ మంచి వ్యక్తిని రెండో వివాహం చేసుకోవాలని కుమారుడు సూచించినట్లు చెప్పారు. ‘ఇప్పటి వరకు నన్ను కష్టపడి పెంచింది చాలు, ఒంటరిగా ఉండొద్దు, నిన్ను బాగా చూసుకునే వాడు రావాలి’ అని కోరుకుంటాడని పేర్కొన్నారు. తనకు తల్లిదండ్రులు లేరని, వారి ప్రేమను సరిగ్గా చూడలేదని, కానీ తన కుమారుడి ప్రేమను చవి చూస్తున్నట్లు చెప్పారామె.. అలాగే భర్త తనను తీవ్రంగా కొట్టేవాడని చెప్పారు.

కొట్టడం సమస్యకు పరిష్కారం కాదని, కూర్చుని మాట్లాడుకోవాలని, సమస్య ఇదని చెబితే అర్థం చేసుకునేదాన్నని అన్నారు. తన చెల్లి పెళ్లి తరువాత తనను బాగా చూసుకుంటానని చెప్పాడని కానీ అతడిలో మార్పు రాలేదని చెప్పారు. కార్తీకేయ (కుమారుడు) కడుపులో ఉన్న సమయంలో కూడా హింసించినట్లు తెలిపారు. ఇలాంటి విషయాలపై అనేక మంది కూడా తమకు ఎదురైన సమస్యల గురించి చెబుతారని, వారికి తనదైన సలహాలు ఇస్తానని తెలిపారు. ముందుగా ఇండిపెండెంట్‌గా బతకాలని సూచించారు. తనకు సరైన వ్యక్తి తారసపడితే రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పారు కౌసల్య.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus