పాన్ ఇండియా డైరెక్టర్ గా ఇండియాలోనే అత్యదిక రెమ్యునరేషన్ అందుకుంటున్న రాజమౌళి ఒకనొక సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా చూశాడు. బలాదూర్ గా గాలికి కూడా తిరిగాడట. ఇంటర్మీడియట్ తరువాత చదివించే స్తోమత లేక చదివించలేకపోయినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తండ్రి కె.విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. రాజమౌళి ఎలాంటి సినిమా చేయాలన్నా కూడా మొదట ఆయన తండ్రి కె.విజయేంద్ర ప్రసాద తోనే ప్రాజెక్ట్ కథ మొదలవుతుంది. ఇక జక్కన్న కెరీర్ ఎలా మొదలైందో దాదాపు అందరికి తెలిసిన విషయమే.
అందరిలాగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఏళ్ల తరబడి చేయకుండా ముందుగా అన్ని క్రాఫ్ట్స్ పై పట్టు సాదించాడు. అందుకు కారణం విజయేంద్రప్రసాద్. ఇంటర్మీడియట్ తరువాత బాధ్యత లేకుండా బలాదూర్ గా తిరగడం స్టార్ట్ చేసిన రాజమౌళిని ఒకరోజు తండ్రి విజయేంద్రప్రసాద్ పిలిచి ఎందుకు ఇలా తిరుగుతున్నావ్ రా.. అసలు నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు అని అడిగినప్పుడు.. డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను అని అనగానే సరే అని ఎడిటర్ చంటి దగ్గర జాయిన్ చేయించారట.
ఇక ఆ తరువాత తన దగ్గర స్టోరీ అసిస్టెంట్ గా కొన్నాళ్ళు పని చేశాడని, అన్నయ్య కీరవాణి దగ్గర మ్యూజిక్ పై అవగాహన తెచ్చుకొని కొంతకాలం రాఘవేంద్రరావు దగ్గర కూడా వర్క్ చేసినట్లు తెలిపారు. ఇక రాఘవేంద్రరావు జక్కన్న టాలెంట్ కు అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాడ్స్ తో పాటు శాంతినివాసం సిరియల్ ను డైరెక్ట్ చేసే అవకాశం ఇప్పిచ్చారని విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!