Vishwambhara: విశ్వంభర మూవీ నుంచి ఆ రచయిత తప్పుకోవడానికి రీజన్స్ ఇవేనా?

చిరంజీవి (Megastar Chiranjeevi) మల్లిడి వశిష్ట (Vassishtha) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర (Vishwambhara) మూవీ రిలీజ్ కు మరో పది నెలల సమయం ఉంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగేలా మేకర్స్ ప్లానింగ్ ఉంది. ఈ సినిమాకు ప్రముఖ డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా (Sai Madhav Burra) పని చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారని తెలుస్తోంది. ఆయనకు బదులుగా మరో రైటర్ ఈ సినిమా కోసం పని చేయనున్నారని భోగట్టా. యూనిట్ తో మనస్పర్ధల వల్ల ఆయన తప్పుకున్నారా? లేక వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకున్నారా? అనే ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి ఉంది.

సాయిమాధవ్ బుర్రా చేతిలో ఎక్కువ సంఖ్యలో సినిమాలు ఉండటం వల్లే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకుని ఉండవచ్చని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సాయిమాధవ్ బుర్రా నిర్మాతగా ఒక సినిమా మొదలుకానుందని తెలుస్తోంది. విశ్వంభర మూవీ 2025 సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఆ సమయానికి ఈ సినిమా కచ్చితంగా విడుదలయ్యేలా మేకర్స్ ప్లాన్ ఉందని సమాచారం అందుతోంది.

విశ్వంభర సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని తెలుస్తోంది. విశ్వంభర సినిమాలో చిరంజీవికి జోడీగా త్రిష (Trisha) నటించడం గమనార్హం. విశ్వంభర సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. విశ్వంభర సినిమా ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుండగా చిరంజీవి కోరుకున్న పాన్ ఇండియా హిట్ ను ఈ సినిమా అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

మల్లిడి వశిష్ట మాత్రం ఈ సినిమా విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. విశ్వంభర సినిమా నుంచి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. చిరు కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విశ్వంభర సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus