సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లు సైతం రాజకీయాల్లో సక్సెస్ సాధించడం అంత తేలిక కాదనే సంగతి తెలిసిందే. 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున తొలిసారి రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినా పవన్ రెండు స్థానాల్లో విజయం సాధించలేకపోయారు. జనసేన పార్టీకి ఒక సీటు వచ్చినా పవన్ మాత్రం ఓటమిపాలయ్యారు.
పవన్ కళ్యాణ్ లా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించి పోటీ చేసిన కమల్ ఎన్నికల్లో ఓడిపోయారు. కమల్ ఎన్నికల్లో డబ్బు పంచకపోవడం వల్లే ఓడిపోయారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ 2014 సంవత్సరంలో మహారాష్ట్రలో నవ్ నిర్మాణ్ సేన్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
బాలీవుడ్ రెబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్న శతృఘ్నసిన్హా 1992 సంవత్సరంలో ఎన్నికల్లో ఓటీ చేసి ఓటమిపాలయ్యారు. బోజ్ పూరీ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న మనోజ్ తివారీ 2009 సంవత్సరంలో సమాజ్ వాది పార్టీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నటుడిగా తెలుగు సినిమాల ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న రవి కిషన్ తొలిసారి కాంగ్రెస్ తరపున జాన్ పూర్ లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ 2014 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రముఖ నటి గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున చండీఘర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!