2021లో సీక్రెట్ పెళ్లిళ్లతో షాక్ ఇచ్చిన హీరోయిన్స్

కరోనా నేర్పిన పాటల్లో లో బడ్జెట్ పెళ్లిల్లు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదారణ జనాల నుంచి స్టార్ సెలబ్రెటీల వరకు కరోనా లాక్ డౌన్ లో సింపుల్ గా పెళ్లిళ్లు చేసేసుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే పెళ్లి చేసుకున్న విషయాన్ని సీక్రెట్ గా దాచిపెట్టి ఆ తరువాత భర్తలతో కనిపించి షాక్ ఇచ్చారు. ఇక 2021లో పెళ్లి చేసుకున్న అలాంటి సెలబ్రెటీల లిస్టు పెద్దగానే ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

యాడ్స్ నుంచి సినిమాల వరకు వచ్చిన గ్లామరస్ బ్యూటీ యామి గౌతమ్ ఏకంగా బాలీవుడ్ దర్శకుడిని పెళ్లి చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్స్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆదిత్య ధార్ ను జూన్ నెలలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే వివాహం చేసుకున్నారు.

2021 ఏప్రిల్ లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న మరో హీరోయిన్ అంగీర దార్. లవ్ ఫర్ స్క్వేర్ పూట్ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ సినిమా దర్శకుడైన ఆనంద్ ను పెళ్లి చేసుకుంది.

మే నెలలో పెళ్లి చేసుకొని ఓ వర్గం వారికి ఎవ్లీన్ శర్మ పెద్ద షాక్ ఇచ్చింది. ఈ బ్యూటీ గతకొంతకాలంగా ఆస్ట్రేలియాకు చెందిన డెంటల్ సర్జన్ తుషాన్ బిందితో డేటింగ్ లో ఉంది. బ్రేకప్ అయినట్లు ఆ మధ్య రూమర్స్ రాగా అమ్మడు కొన్ని రోజులకే పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చింది.

ప్రణీత కూడా సీక్రెట్ వివాహం చేసుకొని ఒక రోజు తరువాత ఆ విషయాన్ని బయటపెట్టింది. బెంగుళూరు బిజినెస్ మెన్ నితిన్ రాజును మే 30న వువాహం చేసుకున్న ప్రణీత ఒకరోజు తరువాత సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చి తన ఫాలోవర్స్ కు షాక్ ఇచ్చింది.

ఈ ఎడాఫీ ఫిబ్రవరి లో అత్యంత గోప్యంగా జరిగిన వివాహల్లో దియా మిర్జా పెళ్లి కూడా ఉంది. వ్యాపారవేత్త వైభవ్ రేఖిని వివాహం చేసుకున్న అమ్మడు మరుసటిరోజు విషయాన్ని కుండబద్దలు కొట్టింది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus