కాలానికి తగినట్టు ప్రేక్షకులు మారుతారు.. వారి అభిరుచులు మారుతుంటాయి. ఆ అభిరుచులను పసిగట్టి దర్శకనిర్మాతలు సినిమాలు తీస్తుంటారు. కొంతమంది సృష్టించిన సినిమాలు, అందులోని పాత్రలు ఎక్కువమంది మనసుకు హత్తుకుంటాయి. చెరగని వేసుకుంటాయి. రీసెంట్ గా సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న రోల్స్ పై ఫోకస్…
మచ్చలేని నటన
మహేష్ బాబు ఇదివరకు ఎన్నో మంచి రోల్స్ చేసి సూపర్ స్టార్ అనిపించుకున్నారు. తాజాగా భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా అద్భుతమైన నటన కనబరిచారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నిజంగా మనకి ఇలాంటి సీఎం ఉంటే బాగుంటుందని అనుకున్నారు. అలా మహేష్ మచ్చలేని నటనతో మెప్పించారు.
నటుడైన హీరో
రామ్ చరణ్ ఒక స్టార్ హీరో. ఈ పేరుని మార్చిన సినిమా రంగస్థలం. ఇందులో సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా చితక్కొట్టారు. నవరసాలను అద్భుతంగా పలికించి చరణ్ మంచి నటుడని పేరుతెచ్చుకున్నారు. ఈ పాత్రని దాదాపు పదేళ్లవరకు ఎవరూ మరిచిపోలేరు.
స్టైల్ మార్చి మెప్పించిన బన్నీ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైలే వేరు. సరదాగా నవ్విస్తాడు. డ్యాన్స్ లతో అదరగొడుతాడు. అక్కడక్కడా విరగకొడతాడు. ఇలా ఉంటుంది అతని సినిమాలు. కానీ నా పేరు సూర్య లో సీరియస్ గా.. దేశభక్తుడిగా అల్లు అర్జున్ చాలా కష్టపడి నటించాడు. ఆ ఫైట్స్ చూస్తుంటే మెచ్చుకోకుండా ఉండలేము.
చెదిరిపోదు కీర్తి
తెలుగు సినిమా చరిత్రలో అభినేత్రి సావిత్రికి అంటూ కొన్ని పేజీలు ఉంటాయి. ఆ పేజీల్లో కీర్తి సురేష్ కి మంచి స్థానం ఉంటుంది. అంతలా సావిత్రి బయోపిక్ లో కీర్తి సురేష్ నటించింది. సావిత్రి అభిమానులంతా కీర్తిని తమ గుండెల్లో దాచుకున్నారు.
కోపం.. ఓ ఎమోషన్
మనకున్న భావోద్వేగాల్లో కోపం ఒకటి. అటువంటి కోపానికి ప్రేమని మిళితం చేసి అర్జున్ రెడ్డి గా విజయ్ దేవరకొండ నటన అమోఘం. హీరో పాత్రకు కొత్త అర్ధాన్ని ఇచ్చిన ఈ రోల్ అందరినీ ఆకట్టుకుంది.
విజయానికి సపోర్ట్
సినిమా విజయం సాధించడంలో హీరోలదే ప్రధాన భాగస్వామ్యం. అయితే సపోర్టింగ్ రోల్స్ కూడా తమవంతు సహాయాన్ని అందిస్తాయి. అటువంటి రోల్స్ లో రంగస్థలం సినిమాలో మహేష్ పోషించిన రోల్ ఒకటి. చిట్టిబాబు గురించి చెప్పేటప్పుడు మహేష్ రోల్ గురించి చెప్పకుండా పూర్తి చేయలేరు. అది ఆ రోల్ గొప్పదనం.
ఈ మధ్య వచ్చిన సినిమాల్లోని మెప్పించిన పాత్రల గురించి వివరించే ప్రయత్నం చేశాం. దీనికి ముందు, తర్వాత అనేక మంచి పాత్రలు వచ్చాయి.. వస్తాయి. వినోదాన్ని పంచుతాయి.