ఓకే అనుకున్నాక మారుస్తున్నారు.. దర్శకుల కాన్ఫిడెన్స్‌ దెబ్బతినదా?

ఫలానా దర్శకుడితో ఫలానా హీరో సినిమా అని పుకార్లు రావడం మొదలు.. అభిమానులు సినిమా గురించి భారీగా ఊహించేసుకుంటారు. అదే ఈ విషయం చిత్రబృందం నుండే వస్తే.. ఆ హుషారు మామూలుగా ఉండదు. ఈ ఉత్సాహం అభిమానులకే కాదు, ఆ దర్శకుడికి కూడా ఉంటుంది. అదే కొత్త దర్శకుడు అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఉత్సాహంలో సినిమా అనౌన్స్‌ కాగానే చాలా కాన్ఫిడెన్స్‌ చూపిస్తారు. ఇలాంటి సమయంలో ఓకే అనుకున్న కథ మార్చాల్సి వస్తే, సినిమా ముందుకెళ్లకపోతే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇలాంటి పరిస్థితినే కొంతమంది దర్శకులు ఎదుర్కొంటున్నారు. అందులో అగ్ర దర్శకులు కూడా ఉన్నారు. అవి కూడా అగ్ర హీరోలతో అయ్యేసరికి.. ఇంకా ఇబ్బందిగా ఉంది. అగ్ర దర్శకుల సినిమాల కథలు అర్ధాంతరంగా మారిపోతుంటే.. కుర్ర దర్శకుల సినిమాలేమో ఏకంగా కథ నచ్చక పూర్తిగా ఆగిపోతున్నాయి. ఈ లిస్ట్‌లో త్రివిక్రమ్‌, కొరటాల శివ, గౌతమ్‌ తిన్ననూరి, వెంకీ కుడుముల, హరీశ్‌ శంకర్ తదితరులు ఉన్నారు. SSMB28 అంటూ ఆ మధ్య త్రివిక్రమ్‌, మహేష్‌బాబు సినిమాను ఘనంగా ప్రకటించారు.

ఒక షెడ్యూల్‌ చిత్రీకరణ కూడా నిర్వహించారు. అయితే సినిమా కథ ఇప్పుడు మారిపోయింది అంటున్నారు. ఆ కథ విషయంలో మహేష్‌ ఏమాత్రం ఆసక్తి లేరని.. అందుకే మార్చేశారని, కొత్త కథతో సంక్రాంతి తర్వాత స్టార్ట్‌ చేస్తారని చెబుతున్నారు. మరోవైపు తారక్‌ – కొరటాల శివ సినిమా రేపో మాపో ప్రారంభం అని ఏడాది క్రితం అనుకున్నారు. కానీ ‘ఆచార్య’ ఫ్లాప్‌ అవ్వడంతో.. ఆ కథకు చాలా మార్పులు చేయమన్నారని, చేశారని టాక్‌.

‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ కథ మొత్తం సిద్ధం చేసుకొని.. షూటింగ్‌ కోసం అంతా ఓకే అనుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల ఆ సినిమా కథను రీమిక్స్‌ చేసి.. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’గా మార్చారు. దీంతో అంతా ఓకే అనుకున్నాక ఈ మార్పులేంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇక మెగా ఫ్యామిలీ గురించి మరో టాక్‌ నడుస్తోంది. వెంకీ కుడుములతో చిరంజీవి సినిమా అని ఘనంగా అనౌన్స్‌ చేశారు. గౌతమ్‌ తిన్ననూరితో సినిమా అని రామ్‌చరణ్‌ అనౌన్స్‌ చేశారు. కానీ ఆ సినిమాలు మెటీరియలైజ్‌ కావడం లేదని వదిలేశారు.

దీంతో అంతా ఓకే అనుకున్నాక సినిమా కథలు మార్చేవాళ్లు కొందరు.. ఏదీ ఫిక్స్‌ కాకుండా అనౌన్స్‌ చేసి ఆపేసేవాళ్లు ఇంకొందరు అంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus