నిహారికను హీరోయిన్ గా తీసుకోవడంపై డైరక్టర్ కామెంట్!

మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయమైన తొలి నటి నిహారిక. బుల్లితెరపై ఆకట్టుకున్న తర్వాత వెండితెరపైకి వచ్చింది. “ఒక మనసు” సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. మరో తెలుగు సినిమాతో తన సత్తా చాటుతుందనుకునేలోపు తమిళ చిత్రంలో అవకాశం దక్కించుంది. నటిగా నిరూపించుకోకముందే ఎలా సెలక్ట్ అయిందని కొంతమంది ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు తాజాగా సమాధానం చెప్పారు.  నిహారిక తమిళంలో నటించిన “ఒరు నల్ల నాల్‌ పాత్తు సొల్రేన్‌” నేడు తమిళనాడులో రిలీజ్ అయింది.  విజయ్‌ సేతుపతి, గౌతమ్‌కార్తిక్‌ హీరోలుగా కొత్త దర్శకుడు ఆర్ముగ కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నీహారిక నటించింది.

ఆమెను సెలక్ట్ చేసుకోవడం వెనుక కారణాన్ని డైరక్టర్ వెల్లడించారు. ”కథలో పాత్రలకు తగ్గట్టుగా ఆర్టిస్టులను ఎంపిక చేస్తున్నప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో నీహారిక ఫోటో చూశాం. ఇద్దరు హీరోయిన్లలో ఒకరి పాత్రకి ఆమె కరెక్టుగా ఉంటుందని అనిపించింది. ఆమెను సంప్రదించి కథ చెప్పాను. కథ వినటంలో ఆమె స్పందించిన తీరు, చూపిన శ్రద్ధను బట్టి సినిమాపై ఆమెకున్న అభిరుచి తెలిసింది. మెగా ఫ్యామిలీ వారసురాలు అన్న దర్పం ఏమాత్రం లేదు. చాలా సాధారణంగా, జాలీగా ఉంది” అని వివరించారు. ఈ సినిమాను తెలుగులో ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నిస్తే.. రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus