‘ప్రభాస్ 21’ వెనుక ఇంత కథ నడిచిందా..!

ప్రభాస్ తో సినిమా చేయడం కోసం ఇప్పుడు చాలా మంది దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఇప్పుడు … అతనో పాన్ ఇండియా స్టార్. అతనితో సినిమా చేస్తే ఇండియన్ లెవెల్లో గుర్తింపు వస్తుంది. అదే వారి తాపత్రయం. ఇక ‘సాహో’ తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ తరువాత ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేస్తాడని అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ను ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మిస్తారని కూడా టాక్ నడిచింది. కానీ సడన్ గా ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కనీసం ఒక్క మాస్ సినిమా కూడా చెయ్యని నాగ్ అశ్విన్ కు ప్రభాస్ ఎలా ఛాన్స్ ఇచ్చాడు. ‘మైత్రి’, ‘దిల్ రాజు’ వంటి నిర్మాతలను పక్కన పెట్టి అశ్వినీ దత్ నిర్మాణంలో చేయడానికి ప్రభాస్ ఎలా ఓకే చెప్పాడు? ఇలాంటి డౌట్స్ చాలానే వ్యక్తమవుతున్నాయి.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ కథ మొదట మెగాస్టార్ చిరంజీవి కోసం రెడీ చేసాడట దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే అశ్వినీ దత్ కు… చిరంజీవికి రాజకీయ విభేదాలు తలెత్తాయి కాబట్టి ప్రభాస్ తో తెరకెక్కించబోతున్నారట. చిరంజీవి, అశ్వినీ దత్ లు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. చరణ్ ను లాంచ్ చేసే బాధ్యత కూడా ఆశ్వినీ దత్ కే అప్పగించారు చిరు. ‘అయితే రాజకీయాలు స్నేహితులని కూడా శత్రువులుగా మార్చేస్తాయి’ అని ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరు పలికిన మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ఆ రీతిగా మూడు రాజధానుల విషయంలో చిరు .. జగన్ నిర్ణయానికి మద్దతు పలకడం వల్ల సమస్య మొదలైంది. ఆ సందర్భంలో అశ్వినీ దత్ .. ‘చిరు కి ఏం తెలుసు’ అనే కామెంట్ కూడా వేయడంతో గొడవ పెద్దది అయ్యింది. ఈ తరుణంలో నాగ్ అశ్విన్ ఓ సోషియో ఫాంటసీ కథని సిద్దం చేసుకుని చిరుని కలిశాడట. కథ నచ్చింది కానీ నా సొంత బ్యానర్ లో అయితే చేస్తాను అని చిరు చెప్పారట. దీంతో నాగ్ అశ్విన్… ‘క్షమించండి.. నా సినిమాలన్నీ ‘వైజయంతి మూవీస్’ బ్యానర్లలోనే ఉంటాయి’ అని చెప్పి వచ్చేసాడని… తరువాత ప్రభాస్ ను కలవడం … ఓకే చెప్పడం జరిగిపోయినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus