అప్పట్లో రాంగోపాల్ వర్మ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. అది సంచలనం అయ్యేది.. కానీ ఇప్పుడు సంచలనం చేయడానికే ఏదో ఒక పని చేస్తున్నాడా అనే అనుమానం కలుగక మానదు. ఈ మధ్యకాలంలో రాంగోపాల్ వర్మ సినిమాలు ఇలా వచ్చి.. అలా వెళ్ళిపోతున్నాయి. జనాలు కూడా ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఆయన చేసే ట్వీట్లు ఆయనని అభిమానించేవారికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఇక ఆయన మాట్లాడే వీడియోలు కూడా అంతే.. ‘ఆటిట్యూడ్’ అంటూ డబ్బా కొట్టుకునే వారు ఈయన మాట్లాడిన వీడియోల్ని స్టేటస్ లుగా పెట్టుకుంటూ ఉంటారు. ఇది పక్కన పెడితే ఇప్పటి వరకూ వర్మ ఎటువంటి వ్యంగ్యమైన కౌంటర్లు వేసినా.. ఆయనకి సరైన కౌంటర్ ఎవ్వరూ వేయలేకపోయారు. ఈ విషయంలో వర్మ కెపాసిటీని మెచ్చుకోవాల్సిందే. అయితే ఇంత కాలానికి.. వర్మ ట్వీట్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు ఓ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆఫీసర్.
తాజాగా వర్మ ఓ వీడియోని పోస్ట్ చేస్తూ ట్వీట్ చేసాడు. ఈ వీడియోలో ‘ఓ వ్యక్తి తన ప్రాంగణంలోని జింకను తుపాకీతో కాల్చుతూ ఉన్నాడు. దీన్ని పోస్ట్ చేసిన ఆర్జీవీ “దేశంలో సల్మాన్‌కి ఓ న్యాయం.. ఇంకొకరికి ఇంకో న్యాయమా? పోలీసులు, న్యాయస్థానం దీనికి ఏం సమాధానం చెబుతాయి’ అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. అయితే తాజాగా వర్మ ట్వీట్ ను ఆ వీడియోని చూసిన… ఓ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ దీని పై స్పందిస్తూ ‘వర్మ పోస్ట్ చేసిన వీడియో ఇక్కడిది కాదని.. బంగ్లాదేశ్‌లోనిదని, ఆ విషయం అక్కడి పోలీసులనే అడగాలని…’ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ గా మారింది. ఏదేమైనా ఇన్నాళ్ళకి.. వర్మకి గట్టి కౌంటర్ పడిందనే’ చెప్పాలి.