అపర్ణా బాలమురళీ.. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు వారికి కూడా దగ్గరైంది. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది. నేషనల్ అవార్డు సైతం దక్కించుకుంది. ఈ సినిమా తరువాత తమిళ, మలయాళ భాషల్లో ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ.. విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కేరళలో ఓ కాలేజీకి వెళ్లింది.
అక్కడ స్టూడెంట్స్ ని కలిసింది. అయితే మీటింగ్ జరుగుతుండగా.. ఒక ‘లా’ స్టూడెంట్ స్టేజ్ మీదకి వచ్చి ఆమెకి ఫ్లవర్ ఇచ్చాడు. ఆ తరువాత అపర్ణా చేయి పట్టుకొని బలవంతంగా నుంచోపెట్టి ఆమె భుజం మీద చేయి వేసి దాగరకు తీసుకోబోయాడు. ఆ సమయంలో ఆమె స్టూడెంట్ కి చిక్కకుండా తప్పించునే ప్రయత్నం చేసింది. ఈ మొత్తం ఇన్సిడెంట్ లో అపర్ణా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటనపై ఇప్పటికే చాలా మంది నటీమణులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఒక హీరోయిన్ తో ఇలా ప్రవర్తిస్తారా..? అంటూ సదరు స్టూడెంట్, కాలేజ్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. తాజాగా అపర్ణా బాలమురళి ఈ ఇన్సిడెంట్ పై స్పందించింది. తాను కాలేజీకి వెళ్లి ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో ఒక యువకుడు చేసిన పని తనకు బాధ కలిగించిందని చెప్పింది. తన చేయి పట్టుకొని బలవంతంగా కుర్చీలో నుంచి పైకి లేపాడని.. తన ప్రమేయం లేకుండానే భుజంపై చేయి వేసే ప్రయత్నం చేశాడని చెప్పుకొచ్చింది.
ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా భుజం మీద చేయి ఎలా వేస్తాడని ప్రశ్నించింది. ఒక మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసే అంత సమయం లేదని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఈ ఘటన జరిగిన తరువాత కళాశాల సిబ్బంది అపర్ణకి క్షమాపణలు చెప్పారని తెలుస్తోంది. అలానే ఆ స్టూడెంట్ ని వారం రోజుల పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు.