టాలీవుడ్ లేటెస్ట్ హిట్ ‘అఖండ’ గురించి చర్చ వచ్చినప్పుడల్లా… వస్తున్న టాపిక్స్ బాలకృష్ణ, బోయపాటి, తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు. సినిమా విజయం సాధించడంలో ఇవన్నీ మంచి పాత్ర పోషించాయి. పరిశీలకులు కూడా ఇదే మాట చెబుతున్నారు. అందులో పోరాట సన్నివేశాల గురించి స్టంట్ మాస్టర్ స్టంట్ శివ మాట్లాడారు. తనయులు కెవిన్, స్టీవెన్‌తో కలసి సినిమా గురించి చెప్పుకొచ్చాడు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ హిట్ ‘అఖండ’.
ఇటీవల విడులైన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి విజయం అందుకుంది. టాలీవుడ్‌కు హిట్ కళ అందించింది అని పరిశీలకులు అంటున్నారు. అలాంటి ఈ సినిమాకు ఫైట్స్ కీలకంగా నిలిచాయి. సెకండాఫ్‌లో వీటి పవర్ చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇదంతా బాలకృష్ణ, బోయపాటి అందించిన సహకారం వల్లే సాధ్యమైందని యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్ శివ చెప్పారు. అఘోరాగా బాలయ్య ఎంట్రీ నుండి క్లైమాక్స్ వరకు మొత్తం ఫైట్స్ కంపోజ్ చేశారు స్టంట్ శివ. వీటి కోసం సుమారు 80 రోజులు పని చేశాం.
60 నుండి 65 రోజులు యాక్షన్ సీక్వెన్స్ కోసం కేటాయించాం. మిగిలిన రోజుల్లో ఎలివేషన్ సీన్స్ తెరకెక్కించాం. బోయపాటి శ్రీను కథ వినిపించిన తర్వాత కొద్ది రోజులు ఫైట్స్ ఎలా తీర్చిదిద్దాలన్న విషయంపై ఆలోచించాం. బాలయ్య సినిమా అంటే వేరే లెవల్ ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్‌ను సుమారు వంద మందితో తీశాం. ఈ సినిమాకు మేము ఫైట్ మాస్టర్స్‌లా పని చేయలేదు. ఫ్యాన్స్‌లా చేశాం అని చెప్పారు.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!