Prabhas, Mahesh Babu: ప్రభాస్, మహేష్ అలాంటి వ్యక్తులన్న సుబ్బరాజు..?

తెలుగు, తమిళ భాషల్లో 50కు పైగా సినిమాలలో నటించి నటుడిగా సుబ్బరాజు పాపులారిటీని సంపాదించుకున్నారు. 2003 సంవత్సరంలో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన సుబ్బరాజుకు ఇప్పటికీ సినిమా ఆఫర్లు తగ్గడం లేదు. సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన సుబ్బరాజు తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ ప్రభాస్, మహేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ పైకి చాలా కఠినంగా కనిపిస్తాడని సుబ్బరాజు పేర్కొన్నారు.

అయితే నిజ జీవితంలో మాత్రం ప్రభాస్ చాలా సున్నితమైన వ్యక్తి అని సుబ్బరాజు చెప్పుకొచ్చారు. ప్రభాస్ తో కలిసి పని చేస్తే సరదాగా ఉంటుందని ప్రభాస్ చాలా అమాయకంగా ఉంటాడని సుబ్బరాజు అన్నారు. బుజ్జిగాడు, మిర్చి, బాహుబలి సినిమాలలో ప్రభాస్, సుబ్బరాజు కలిసి నటించారు. ఈ సినిమాలలో బుజ్జిగాడు మినహా మిగిలిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. మరో హీరో మహేష్ గురించి మాట్లాడుతూ మహేష్ పైకి సెన్సిటివ్ గా కనిపించినా ఆయన ఖచ్చితమైన నటుడు అని సుబ్బరాజు తెలిపారు. ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలని మహేష్ ఎప్పుడూ కోరుకుంటాడని సుబ్బరాజు అన్నారు.

మహేష్ సుబ్బరాజు కాంబినేషన్ లో పోకిరి, అతిథి, బిజినెస్ మేన్, శ్రీమంతుడు, ఖలేజా, దూకుడు సినిమాలు వచ్చాయి. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీతో బిజీగా ఉండగా ప్రభాస్ సలార్, ఆదిపురుష్, రాధేశ్యామ్ షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ రాధేశ్యామ్ ఈ ఏడాది రిలీజ్ కానుండగా మిగిలిన సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి. మహేష్ సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus