“శుభలేఖ+లు”

  • December 8, 2018 / 12:32 PM IST

చిన్న సినిమాగా.. అందరూ కొత్త నటీనటులతో రూపొంది పోస్టర్స్, టీజర్స్ తో ప్రేక్షకుల్ని అలరించిన చిత్రం “శుభలేఖ+లు”. నవతరం ప్రేమలు, పిల్లల పెంపకంలో పెద్దల ప్రమేయం వంటి విషయాల నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి ప్రీరిలీజ్ బజ్ వచ్చింది. మరి సినిమా ఆ బజ్ కు తగ్గట్లుగా ఉందా లేదా అనేది చూద్దాం..!!

కథ:


పెద్దలు అప్పటికే కుదిర్చిన వివాహం ఇష్టం లేకపోవడమే కాక ఆల్రెడీ ఒక పెళ్ళైన వ్యక్తితో రిలేషన్ లో ఉన్న కారణంగా.. పెద్దలు నిర్ణయించిన వివాహం చేసుకోవాలా? లేక లేచిపోయి తాను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లాడాలా అని కన్ఫ్యూజన్ లో ఉన్న నిత్య (ప్రియ వడ్లమాని).
సవతితల్లి సరిగా పట్టించుకోకపోవడంతో తల్లిదండ్రుల ప్రేమకి దూరంగా పెరిగిన కుర్రాడు చందు (సాయి శ్రీనివాస్).

ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్ల జీవితాల్లో చోటు చేసుకున్న విషయాలు వాళ్ళ కుటుంబాలను ఎలా ఎఫెక్ట్ చేశాయి? అనేది “శుభలేఖ+లు” కథాంశం.

నటీనటుల పనితీరు:


నటీనటులందరూ కొత్తవాళ్లే. స్క్రీన్ ప్రెజన్స్ సోసోగా ఉన్నా.. పెర్ఫార్మెన్స్ లు మాత్రం పర్వాలేదనిపించాయి. స్ట్రిక్ట్ పెదనాన్న పాత్రలో అప్పాజీ అంబరీష్ మాత్రం ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా.. నటీనటులందరివీ యావరేజ్ పెర్ఫార్మెన్స్ లే.

సాంకేతికవర్గం పనితీరు:


దర్శకుడు శరత్ నర్వాడే అసలు ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం చెప్పాడు, ఆ సన్నివేశాలను ఎందుకని అల్లుకుంటూపోయాడు, చివరికి ఏం కంక్లూడ్ చేశాడు అనేది సినిమాని సెకండ్ టైమ్ చూసినా అర్ధం కాదు. ఒక్క సన్నివేశంలో మాత్రం పెద్దలు పిల్లల్ని సరిగా పట్టించుకోకపోవడం వల్లే వాళ్ళ ఎదుగుదల అలా ఉంది అంటూ చెప్పించడం కూడా ఏదో ఇరికించినట్లుగా ఉంటుంది తప్పితే కథనంలో భాగంగా మాత్రం అనిపించదు. హీరోయిన్ క్యారెక్టర్ బోల్డ్ అని చూపించడానికి ఆమె చేత కాల్పించినన్ని సిగిరెట్లు.. మన కమర్షియల్ సినిమాలో విలన్లు కూడా తాగి ఉండరు.

ఇలా చెప్పుకుంటూపోతే ఒక సన్నివేశమని కాదు.. దాదాపుగా అన్నీ సన్నివేశాల్లోనూ ఇదేం లాజిక్ రా బాబు, ఇదేం డీలింగ్ రా బాబు అనిపించకమానదు. ఇక కెమెరా వర్క్ షార్ట్ ఫిలిమ్స్ క్వాలిటీకి ఏమాత్రం తగ్గకుండా ఉంది. “గోదావరి” లాంటి చిత్రానికి పని చేసిన కె.ఎం.రాధాకృష్ణ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి బాణీలు అందించాడు అంటే నమ్మడం చాలా కష్టం. ఒక్కటంటే ఒక్క బాణీ కూడా వినసోంపుగా లేదు.

విశ్లేషణ:


చిన్న సినిమా అంటే మంచి కాన్సెప్ట్ తో రూపొందుతాయి అనే స్థాయి నుంచి.. బడ్జెట్ లేక ఏది పడితే అది తీసే సినిమాలే “చిన్న సినిమాలు” అనే స్థాయికి చిన్న సినిమాలు పడిపోతున్నాయి అంటే కారణం ఈ తరహా సినిమాలే. టైటిల్, పోస్టర్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని థియేటర్లో మాత్రం నీరసం తెప్పిస్తారు. ఈ “శుభలేఖ+లు” కూడా ఆ తరహా చిత్రమే.

రేటింగ్: 0.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus