Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » స్టార్ దర్శకుల జయాపజయాలపై ఫోకస్

స్టార్ దర్శకుల జయాపజయాలపై ఫోకస్

  • December 26, 2017 / 11:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ దర్శకుల జయాపజయాలపై ఫోకస్

విజయానికి కొత్త.. పాత అని తేడా లేదు. సీనియర్.. జూనియర్ అనే బేధం లేదు. కష్టపడ్డ వాడికి విజయలక్ష్మి వరిస్తుంది. ఇందుకు సినీ పరిశ్రమ మినహాయింపు కాదు. అయితే ఇక్కడ కష్టంతో పాటు క్రియేటివిటీ అవసరం. కష్టానికి క్రియేటివిటీ జోడిస్తే హిట్ అందుకుంటారు. కొన్నేళ్లుగా శ్రమించి .. స్టార్ డైరక్టర్స్ గా పేరు తెచ్చుకున్న వారికి ఈ సంవత్సరం ఎన్ని విజయాలను ఇచ్చిందో .. తెలుసుకుందాం.

ఎస్‌.ఎస్‌.రాజమౌళిRajamouliతనను నమ్మి ఐదేళ్లు కేటాయించిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కి బాహుబలి కంక్లూజన్ అద్భుత విజయాన్ని ఇచ్చింది. కలక్షన్స్ తో పాటు అవార్డుల వర్షం కురిపించింది. అపజయం ఎరుగని దర్శకుడిగా పేరును కొనసాగిచ్చింది.

వి వి వినాయక్ V.V.Vinayakఅఖిల్ మూవీతో అపజయం.. అపవాదు మూటగట్టుకున్న వివి వినాయక్ కి ఈ సంవత్సరం మంచి కానుకని అందించింది. మెగాస్టార్ చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150 రూపంలో హిట్ వరించింది.

క్రిష్ Krishవిలక్షమైన కథలతో ప్రయోగాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటూ వస్తున్న క్రిష్.. ఈ ఏడాది అదే బాటలో నడిచారు. గౌతమీపుత్ర శాతకర్ణి తో ఇది వరకటి కంటే ఘనవిజయాన్ని అందుకున్నారు.

పూరి జగన్నాథ్‌ Puri Jagannadhడేరింగ్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ ఈ ఏడాది ఇషాన్‌ తో రోగ్‌, బాలకృష్ణ తో పైసావసూల్‌ తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలకు రిలీజ్ కి ముందు ఉన్న క్రేజ్.. రిలీజ్ అయినా తర్వాత లేదు.

హరీష్ శంకర్ Harish Shankarగబ్బర్ సింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన హరీష్ శంకర్ అల్లు అర్జున్‌ తో డీజే (దువ్వాడ జగన్నాథమ్‌) చేశారు. ఇది వందకోట్ల క్లబ్ లో చేరి చిత్ర బృందానికి ఆనందాన్ని పంచింది.

బోయపాటి శ్రీనుBoyapati Srinuస్టార్‌ హీరోలు క్యూలో ఉన్నప్పటికీ బోయపాటి శ్రీను.. బెల్లంకొండ శ్రీనుతో జయ జానకి నాయక చిత్రం చేశారు. విజయానికి, అపజయానికి మధ్య ఊగిసలాడారు.

ఎ.ఆర్‌.మురుగదాస్‌A.R.Murugadossతమిళ దర్శకుడు ఎ.ఆర్‌.మురుగదాస్‌ సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ రూపొందించారు. ఏకకాలంలో రెండు భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

బాబీBobbyపవర్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న బాబీ ఈ ఏడాది ఎన్టీఆర్‌ తో జై లవకుశ తెరకెక్కించారు. తారక్ లోని నటనను మూడు పాత్రలతో వెలికితీయించి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు.

మారుతిMaruthiచిన్న కథలతో బిగ్ హిట్ అందుకునే మారుతి.. ఈ ఏడాది కూడా శుభ్రమైన విజయాన్ని కైవశం చేసుకున్నారు. శర్వానంద్‌ హీరోగా నటించిన ఈ మూవీ అందరినీ నవ్వించి.. హిట్ జాబితాలో చేరింది.

కె. రాఘవేంద్రరావుK.Raghavendra Raoచాలా కాలం తర్వాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఓం నమో వేంకటేశాయ అనే భక్తి కథ చిత్రాన్ని తీశారు. ఇది ఘోర పరాజయం పాలైంది.

వంశీVamsiగోదావరి తీరం కథలతో క్లాసిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న వంశీ.. ఈ సారి ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌ సినిమాని తీశారు. హిట్ కొట్టలేకపోయారు.

కృష్ణవంశీ Krishna Vamshiక్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీకి ఈ ఏడాది కూడా విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఈ సంవత్సరం అతను నక్షత్రం సినిమాని తీసుకొచ్చారు. విజయాన్ని తీసుకెళ్లలేకపోయారు.

ఇలా విజయం ఒకరి సొత్తుకానట్టు.. కొందరికి అరచేతిలో చిక్కింది. మరికొందరికి చిక్కినట్టే చిక్కి చేయి జారీ పోయింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Boyapati Srinu
  • #Director Bobby
  • #Director Krish
  • #Director Maruthi

Also Read

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

related news

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

Rama Rajamouli: సీరియల్లో దర్శనమిచ్చిన రాజమౌళి భార్య.. ఏ సీరియల్ అంటే?

Rama Rajamouli: సీరియల్లో దర్శనమిచ్చిన రాజమౌళి భార్య.. ఏ సీరియల్ అంటే?

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

trending news

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

2 mins ago
Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

38 mins ago
డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

46 mins ago
విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

1 hour ago
17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

1 hour ago

latest news

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

3 hours ago
తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

3 hours ago
Vikram Bhatt: రూ.30 కోట్ల మోసం.. పోలీసు అదుపులో స్టార్‌ దర్శకుడు.. ఏమైందంటే?

Vikram Bhatt: రూ.30 కోట్ల మోసం.. పోలీసు అదుపులో స్టార్‌ దర్శకుడు.. ఏమైందంటే?

3 hours ago
Balakrishna: బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

Balakrishna: బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

3 hours ago
Dileep: హీరోయిన్ అత్యాచార కేసులో సంచలన తీర్పు.. బయటపడ్డ హీరో, దోషులు ఎవరంటే?

Dileep: హీరోయిన్ అత్యాచార కేసులో సంచలన తీర్పు.. బయటపడ్డ హీరో, దోషులు ఎవరంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version