Sudeep: శాండిల్‌ వుడ్‌లోనూ జస్టిస్‌ హేమ కమిటీ.. సుదీప్‌ రియాక్షన్‌ ఇదే!

  • September 23, 2024 / 09:15 AM IST

మలయాళం సినిమా ఇండస్ట్రీలో జస్టిస్‌ హేమ కమిటీ తీసుకొచ్చిన మార్పు గురించి మీకు తెలిసిందే. పరిశ్రమలో మహిళల పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని, ఇండస్ట్రీలో అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఆ కమిటీ నివేదికలో తేలింది. ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవాలని డిస్కషన్స్‌ జరుగుతున్నాయి. అయితే ఆ నివేదిక ఇతర సినిమా పరిశ్రమల్లో కూడా వాయిస్‌ రేంజ్‌లకు కారణమైంది. ఈ క్రమంలో సుదీప్‌ (Sudeep) చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. కన్నడ చిత్ర పరిశ్రమలో మహిళా నటులకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, వాటి గురించి అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేయాలని కొంతమంది నటీమణులు ఇటీవల డిమాండ్‌ చేశారు.

Sudeep

దీనిపై నటుడు సుదీప్‌ పరోక్షంగా స్పందించారు. టెలివిజన్‌ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, టెక్నిషియన్స్‌తో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుధీర్‌ ఆ వ్యాఖ్యలు చేశారు. అసత్య వార్తలతో కన్నడ చిత్ర పరిశ్రమ వార్తల్లో నిలుస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన సుదీప్‌.. మా పరిశ్రమ గురించి తప్పుగా అనుకునేవారికి సందేశం ఇవ్వాలనే మేము కలిసి వచ్చామని చెప్పారు. ఇక్కడ మేమంతా ఒక్కటే. వెయ్యి మంది వెయ్యి రకాలుగా మాట్లాడుకున్నా మా పరిశ్రమ పట్ల గర్వంగా ఉన్నాం అని చెప్పారు.

కన్నడ సినిమా పరిశ్రమకు 90 ఏళ్ల చరిత్ర ఉంది అని సుదీప్‌ అన్నాడు. కన్నడ చిత్రపరిశ్రమలోనూ మహిళలు వేధింపులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. వాటిని బయటకు రానివ్వరు అని ఇటీవల నటి నీతూ శెట్టి ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాదు కన్నడ పరిశ్రమలో నటించిన ఏ నటినైనా అడగండి. వాళ్ల దగ్గర చెప్పడానికి తప్పకుండా ఒక వేధింపుల కథ ఉంటుంది అని మరో నటి ఆరోపించారు.

ఈ నేపథ్యంలో సుదీప్‌ పై వ్యాఖ్యలు చేశారు అని అర్థమవుతోంది. మరి ఆరోపణలు చేసిన నీతూ శెట్టి కానీ ఇతర నటీమణులు కూడా ఇప్పుడు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి. వాటికి సుదీప్‌ ఏమన్నా రియాక్ట్‌ అవుతాడా? లేక ఇతర నటులు ఏమన్నా రియాక్ట్‌ అవుతారా అనేది చూడాలి.

అమితాబ్‌ గురించి అద్భుతంగా మాట్లాడిన రజనీ.. ఆయనకు మాత్రమే సాధ్యమంటూ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus