తెలుగులో 500కు పైగా సినిమాలలో నటించడంతో పాటు స్టార్ హీరోలకు తల్లిగా ఎక్కువ సినిమాలలో నటించి సుధ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగంలో జన్మించిన సుధ శ్రీ వినాయక విజయం అనే మూవీతో బాలనటిగా పరిచయమయ్యారు. తాను తమిళనాడులో పుట్టినా తెలుగులోనే తనకు ఎక్కువ గుర్తింపు వచ్చిందని ఆమె కామెంట్లు చేశారు. తన మాతృభాష తమిళం అయినా తెలుగుకే ప్రాధాన్యత ఇస్తానని ఒక ఇంటర్వ్యూలో చెప్పానని సుధ చెప్పారు.
తెలుగులోనే తనకు మంచి పాత్రలు దక్కాయని ఆమె పేర్కొన్నారు. కెరీర్ తొలినాళ్లలో భాష తెలియక కొంచెం ఇబ్బంది పడ్డానని సుధ తెలిపారు. తల్లిదండ్రులు సినిమా వల్ల తాను తెలుగు నేర్చుకున్నానని సుధ పేర్కొన్నారు. నేను చాలా సెన్సిటివ్ అని సెట్ లో ఎవరైనా గొడవ పడితే కూడా తాను ఏడుస్తానని సుధ వెల్లడించారు. హెయిర్ డ్రెస్సర్ నాగరాజు వల్ల తనకు గ్యాంగ్ లీడర్ మూవీలో ఛాన్స్ దక్కిందని సుధ పేర్కొన్నారు.
ఆమె సినిమా తర్వాత తాను వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదని సుధ అన్నారు. ఇ.వి.వి. సత్యనారాయణ తనను మదర్ ఇండియా అని పిలుస్తారని సుధ పేర్కొన్నారు. ఆ సినిమాలో ఏడ్చే సీన్లలో ఎక్కువగా నటించానని సుధ వెల్లడించారు. క్లైమాక్స్ లో కోట శ్రీనివాసరావుతో పోటీ పడి నటించాల్సిన సీన్ ఉందని సుధ పేర్కొన్నారు. ఇ.వి.వి. సత్యనారాయణ డైరెక్షన్ లో తెరకెక్కిన 14 సినిమాలలో తాను నటించానని సుధ అన్నారు.