Sudheer Babu: కొడుకు సినీరంగ ప్రవేశం పై సుధీర్ బాబు క్లారిటీ.!

టాలీవుడ్ హీరోల్లో ఒకరైన సుధీర్ బాబు (Sudheer Babu).. ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన హీరో అయినప్పటికీ ఆ బ్యాక్ గ్రౌండ్ ను ఏనాడూ వాడుకోలేదు. ఒకవేళ వాడుకున్నా… అది ప్రమోషన్స్ వరకు మాత్రమే తప్ప.. కథలు, దర్శకుల విషయంలో రికమండేషన్లు వంటివి చేయించుకుంది అంటూ ఏమీ లేదు. అలాగే ఒకే జోనర్..కి స్టిక్ అయ్యి సినిమాలు చేసింది అంటూ కూడా ఏమీ లేదు. ‘ప్రేమ కథా చిత్రం’ (Prema Katha Chitram) సినిమా హిట్ అయినా అదే జోనర్లో ఇంకో సినిమా చేయలేదు.

Sudheer Babu

హిట్ అయినా.. ప్లాప్ అయినా సేమ్ జోనర్లో సినిమాలు చేయడం ఇతనికి నచ్చదు.ఈయన గత చిత్రం ‘హరోం హర’ (Harom Hara) కి మంచి రివ్యూలు వచ్చాయి. త్వరలో ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈరోజు ఆ సినిమా టీజర్ లాంచ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా సుధీర్ బాబు పెద్ద కొడుకు చరిత్ మానస్ గురించి డిస్కషన్ వచ్చింది.

మహేష్ బాబు  (Mahesh Babu) పోలికలు చరిత్ మానస్..లో ఎక్కువగానే ఉంటాయి. సో కచ్చితంగా ఇతను హీరోగా ఎంట్రీ ఇస్తే.. మాత్రం సక్సెస్ అవుతాడు అని మహేష్ అభిమానులు సైతం భావిస్తున్నారు. ఇక ఇదే విషయం పై సుధీర్ బాబుకి ఓ ప్రశ్న ఎదురైంది. చరిత్ మానస్ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అనే ఈ ప్రశ్నకి సుధీర్ బాబు సమాధానం ఇస్తూ..

“ఓ నాలుగేళ్లలో మా అబ్బాయి చరిత్ ఎంట్రీ ఉండబోతుంది. ఎందుకంటే నేను ఆగమన్నా ఆగేలా లేడు వాడు” అంటూ సమాధానం ఇచ్చాడు. సో 4 ఏళ్లలో అతని డెబ్యూ మూవీ ఉంటుందన్న మాట. అదే టైంకి రాజమౌళి  (S. S. Rajamouli)  – మహేష్ బాబు సినిమా కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం చరిత్ మానస్ నటనలో శిక్షణ తీసుకుంటున్నట్టు కూడా వినికిడి.

దేవర సెన్సార్ కట్స్ విషయంలో క్లారిటీ ఇదే.. ఆ మార్పులు చేశారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus