ప్రామిస్ చేసిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదని హర్ట్ అయిన హీరోలను చూసి ఉంటాం, ప్రమోషన్స్ సరిగా చేయడం లేదని అలిగిన కథానాయకులను చూసి ఉంటాం. కానీ.. షూటింగ్ మొత్తం పూర్తయ్యాక తన క్యారెక్టర్ కి ఇచ్చిన స్కోప్ లేదని హర్ట్ అయిన హీరోను చూసారా. అతనే సుధీర్ బాబు. “సమ్మోహనం, నన్ను దోచుకుందువటే” చిత్రాలతో వరుస విజయాలు అందుకొన్న సుధీర్ బాబు ఆ సినిమాలకంటే ముందు ఒప్పుకొన్న “వీరభోగ వసంత రాయులు” విషయంలో చాలా హర్ట్ అయ్యాడట. ముఖ్యంగా సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు తనకు చెప్పిన క్యారెక్టరైజేషన్ కి, సినిమా అవుట్ పుట్ కి సంబంధం లేకపోవడంతో తన క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడం మానేశాడట సుధీర్ బాబు.
మొన్న ట్రైలర్ విడుదలైనప్పుడు చాలామంది సుధీర్ బాబు ఆ సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల డబ్బింగ్ చెప్పలేదేమో అనుకున్నారు. కానీ.. నిన్న ఓవర్సీస్ లో వేసిన స్పెషల్ ప్రివ్యూ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సుధీర్ బాబు అలా ఎందుకు డిసైడ్ అయ్యాడో అందరికీ అర్ధమైంది. ఏది ఏమైనా.. ఒప్పుకొన్న సినిమాకి నచ్చినా నచ్చకపోయినా డబ్బింగ్ చెప్పాలి కానీ.. ఇలా మధ్యలో వదిలేయడం మాత్రం సమంజసం కాదు.