Sudheer Babu, Krithi Shetty: కృతిశెట్టిని సావిత్రితో పోల్చిన సుధీర్.. కానీ?

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన కృతిశెట్టి తొలి సినిమాతోనే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ల రికార్డులను సాధించారు. ఉప్పెన సినిమాకు కృతిశెట్టి నటన హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా వల్ల కృతిశెట్టికి తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీలలో ఆఫర్లు వచ్చాయి. శ్యామ్ సింగరాయ్ సినిమాలో కృతిశెట్టి ఒక హీరోయిన్ గా నటించగా ఈ మూవీతో కృతిశెట్టి ఖాతాలో మరో సక్సెస్ చేరింది. ప్రస్తుతం కృతిశెట్టి నటిస్తున్న కొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

సుధీర్ బాబు, కృతిశెట్టి కాంబినేషన్ లో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ త్వరలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా ఈ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంఛ్ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ఆ అమ్మాయి గురించి చెప్పడానికి ముందు డైరెక్టర్ ఇంద్రగంటి గురించి ప్రేక్షకులకు చెప్పాలని అన్నారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ తన ఫేవరెట్ డైరెక్టర్ అని అందువల్లే ఆయన డైరెక్షన్ లో మూడు సినిమాలు చేశానని సుధీర్ బాబు తెలిపారు. కృతిశెట్టిని ఉప్పెనలో ఒకలా చూసి ఉంటారని ఈ సినిమాలో ఆమె డిఫరెంట్ గా కనిపిస్తారని సుధీర్ బాబు అన్నారు. కృతిశెట్టి ప్రీ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని దానిని బట్టి ఈ మూవీలో కృతి కొత్తగా కనిపిస్తుందని ప్రేక్షకులకు అర్థమైందని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.

సావిత్రి గారి బయోపిక్ మహానటి చూసే సమయంలో కళ్లలో కొద్దిగా నీళ్లు రావాలంటే అలా ఎలా జరుగుతుందని సుత్తి అనుకున్నానని సుధీర్ బాబు తెలిపారు. అయితే అలాగే కృతిశెట్టి గ్లిజరిన్ లేకుండా చేసిందని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. ఎలా చేశారని అడిగితే కృతి ఆ విషయం మాత్రం చెప్పలేదని సుధీర్ కామెంట్లు చేశారు. గ్లిజరిన్ లేకుండా కృతి నటించడం గ్రేట్ అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే కృతిశెట్టి మరీ అద్భుతమైన నటి కాదని ఆమె నటన విషయంలో మరింత మెరుగుపడాలని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus