Sudheer Babu: ఆయనతో వరుస సినిమాలపై సుధీర్‌బాబు కామెంట్స్‌!

దర్శకుడు – హీరో దగ్గరదగ్గరలో సినిమాలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఇటీవల అలా సినిమాలు చేసిన దర్శకుడు – హీరోల కాంబోలో మోహనకృష్ణ ఇంద్రగంటి – సుధీర్‌బాబు ఒకటి. ‘సమ్మోహనం’ అంటూ తొలుత వచ్చిన ఈ కాంబో… ‘వి’ సినిమాతో కరోనా సమయంలో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అంటూ మరోసారి 16వ తేదీన వస్తున్నారు. అలా వరుసగా సినిమాలు ఎలా? అని అడిగితే సుధీర్‌బాబు ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

సినిమా నేపథ్యంలో మూడో సినిమా చేస్తున్నారు కదా మోహనకృష్ణ.. అందులో మీరు నటిస్తున్నారా అంటే.. మా కలయికకి ఇప్పటికే చాలా మంది దిష్టి పెట్టారు అంటూ నవ్వేశాడు సుధీర్‌బాబు. ఆ సినిమా నేపథ్యం గురించి చెబుతూ.. మరి ఆ సినిమాని నాతో చేస్తారో లేదో తెలియదు చెప్పాడు. దీంతో సుధీర్‌ ఫన్నీ రెస్పాన్స్‌కి సోషల్‌ మీడియాలో నవ్వులు పూస్తున్నాయి. నిజమే కదా.. వరుసగా సినిమాలు చేయడం అంటే పెద్ద విషయమే మరి. ‘‘నన్ను నటుడిగా ఆయన నమ్మారు, ఆయన కథల్ని నేను నమ్ముతాను.

అదే మా కలయికలో సినిమాలు రావడానికి కారణం’’ అంటూ రీజన్‌ కూడా చెప్పారు సుధీర్‌బాబు. ‘‘ఇందగ్రంటి ఎప్పుడూ కాంబినేషన్‌ను దృష్టిలో పెట్టుకుని కథలు సిద్ధం చేసుకోరు. ఓ హిట్‌ కొట్టిన వెంటనే దర్శకులు పెద్ద స్టార్లని దృష్టిలో ఉంచుకుని కథలు రాస్తుంటారు కొందరు. ఇంద్రగంటి అలా కాదు, తను రాసుకున్న కథలకి తగ్గట్టుగానే నటుల్ని ఎంచుకుంటూ ఉంటారు. మార్కెట్‌, వసూళ్లు, ఇతరత్రా లెక్కలేవీ పట్టించుకోరు. అయితే ఆయన కథలకి తగ్గ నేను కావడం అదృష్టంగా భావిస్తాను’’ అని క్లారిటీ ఇచ్చారు సుధీర్‌బాబు.

‘‘సమ్మోహనం’ తరహాలోనే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా నేపథ్య కథే కావొచ్చు. కానీ రెండింటికీ ఏమాత్రం పొంతన ఉండదు. ‘సమ్మోహనం’ అబ్బాయి, అమ్మాయి మధ్యలో సంఘర్షణ నేపథ్యంలో సాగే సినిమా. ‘ఆ అమ్మాయి…’ అయితే ప్రేమ, కుటుంబం, డ్రామా అంశాలతో సాగుతుంది’’ అని చెప్పారు సుధీర్‌బాబు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus