Sudheer Babu, Mahesh Babu: మహేష్ ను ఫేవర్ అడగలేదంటున్న సుధీర్ బాబు!

  • February 9, 2022 / 07:21 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా సుధీర్ బాబు తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబుకు జోడీగా కృతిశెట్టి నటిస్తుండగా ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుధీర్ బాబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. సర్కారు వారి పాట సినిమాలో చిన్నప్పటి మహేష్ పాత్రలో తన చిన్న కొడుకు దర్శన్ నటిస్తున్నాడని సుధీర్ బాబు అన్నారు.

Click Here To Watch

తన పెద్ద కొడుకు చరిత్ తను హీరోగా హర్ష డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. తన కొడుకులకు కూడా సినిమాలపై ఆసక్తి ఉందని ఆయన అన్నారు. అందరు దర్శకులతో తనకు పని చేయాలని ఉందని స్టార్ డైరెక్టర్లతో పని చేస్తే కెరీర్ పరంగా హెల్ప్ అవుతుందని ఆయన అన్నారు. కొత్త దర్శకులతో పని చేయడం సంతోషాన్ని కలిగిస్తుందని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. మంచి కథ కుదిరితే పాన్ ఇండియా సినిమాలలో నటించడానికి సిద్ధమేనని సుధీర్ బాబు అన్నారు.

మహేష్ తో కలిసి నటించడం సంతోషాన్ని కలిగిస్తుందని మంచి పాత్ర దొరికితే మహేష్ తో కలిసి నటించడానికి తాను సిద్ధమేనని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. కృష్ణ, మహేష్ లను ఒక ప్రాజెక్ట్ చేసిపెట్టాలని తాను ఎప్పుడూ ఫేవర్ అడగలేదని సుధీర్ బాబు తెలిపారు. టాలెంట్ తో నిలబడాలనే ఆలోచనతో తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు. నటుడిగా ప్రూవ్ చేసుకుంటే లాంగ్ కెరీర్ ఉంటుందని భావించి బాగీ సినిమా చేశానని సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.

తాను యాక్షన్ సినిమాలలో తక్కువగా నటించానని కుదిరితే యాక్షన్ సినిమాల్లో నటించాలని ఉందని సుధీర్ బాబు తెలిపారు. సుధీర్ బాబు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus