Sudheer Babu: యాక్షన్ సినిమాల పై సుధీర్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ హీరోలలో ఒకరిగా పలు సినిమాలలో నటిస్తూ గుర్తింపు పొందినటువంటి వారిలో సుధీర్ బాబు ఒకరు. ఈయన మహేష్ బాబు బావగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి సుధీర్ బాబుకు పెద్దగా ఆశించిన స్థాయిలో మాత్రం సక్సెస్ అందలేదని చెప్పాలి. ఇక ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా మామ మష్చంద్ర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మరోసారి కూడా నిరాశ ఎదురయింది.

ఇకపోతే తాజాగా హరోం హరా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సుధీర్ బాబు సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా ఆయన హిట్ అందుకోవాలనే ఉద్దేశంతో ఈయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ఈయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక నటన పరంగా సుధీర్ బాబు ఎంతో అద్భుతంగా నటిస్తారు కానీ ఈయనకు మాత్రం కలిసి రాలేదని చెప్పాలి.

డాన్సులతో పాటు యాక్షన్ సన్ని వేషాలలో కూడా సుధీర్ బాబు ఎంతో అద్భుతంగా నటిస్తారు. అయితే తాజాగా పాల్గొన్నటువంటి మీడియా సమావేశంలో భాగంగా సుదీర్ బాబును మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ మీరు యాక్షన్ హీరోగా స్థిరపడాలని కోరుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుధీర్ బాబు సమాధానం చెబుతూ…యాక్షన్ చిత్రాలు చెయ్యడం అంటే నాకు చాలా ఇష్టం. టాలీవుడ్ లో యాక్షన్ సినిమాలు నాకు సరిపోయే విధంగా ఏ హీరోకి కూడా సరిపోదు..కచ్చితంగా రాబోయే రోజుల్లో యాక్షన్ చిత్రాలు చేస్తానని సమాధానం చెప్పారు.

ఇలా యాక్షన్ సినిమాల గురించి (Sudheer Babu) సుదీర్ బాబు ఈ సందర్భంగా చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి హరోం హర సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేక ఈ సినిమా కూడా నిరాశ పరుస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus