సుధీర్ వర్మ… అందరికీ సుపరిచితమే. ‘స్వామి రారా’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. నిఖిల్, స్వాతి జంటగా నటించిన ఈ చిత్రం 2013 లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత సుధీర్ వర్మ చేసిన సినిమాలు ఏవీ కూడా సూపర్ హిట్లు అయిన దాఖలాలు లేవు. ‘దోచేయ్’ ‘కేశవ’ ‘రణరంగం’ ‘షాకినీ డాకినీ’ ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే గత ఏడాది వచ్చిన ‘షాకినీ డాకినీ’ చిత్రంతో సుధీర్ వర్మ కాస్త ఎక్కువ వార్తల్లోనే నిలిచాడు.
ఎందుకంటే సుధీర్ వర్మ (Sudheer Varma) ఆ చిత్రం విడుదల టైంలో ప్రమోషన్లలో ఎక్కడ కూడా కనిపించలేదు. కనీసం తన సినిమా రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని కూడా అతను పట్టించుకోలేదు. దీనికి కారణం ఏంటని అడిగితే.. ఇతను సింపుల్ గా ఆ టాపిక్ ను వదిలేయండి అంటున్నాడు. అయితే ‘రావణాసుర’ విడుదల సందర్భంగా సుధీర్ వర్మ .. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అందులో ఈ విషయం పై స్పందించినట్టు తెలుస్తుంది.
‘షాకినీ డాకిని’ .. కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’ కి రీమేక్. తెలుగులో కొన్ని మార్పులు చేద్దాం అని సుధీర్ వర్మ కోరాడట. కానీ ఇన్సైడ్ ప్రెజర్ ఎక్కువవడం వల్ల అతనికి నచ్చకపోయినా.. టీంకి నచ్చినట్టు ‘షాకినీ డాకిని’ సినిమా చేయాల్సి వచ్చిందని ఇతను చెప్పినట్టు తెలుస్తుంది. అదీ కాక మొదట ఆ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తామని చెప్పారని.. కానీ చివరి నిమిషంలో థియేటర్లలో రిలీజ్ చేసినట్టు కూడా సుధీర్ వర్మ చెప్పినట్టు ఇన్సైడ్ సర్కిల్స్ సమాచారం.