Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

ఓ దర్శకుడు తీసిన సినిమాల్లోని పాత్రలు.. అతను డైరెక్ట్ చేసిన మరో సినిమాలోకి వస్తున్నాయి అంటే.. ఆ క్రేజే వేరు. వాస్తవానికి హాలీవుడ్ సినిమాల్లో ఇలాంటివి చూస్తుంటాం. అయితే దర్శకుడు లోకేష్ కనగరాజ్ దీనిని పాపులర్ చేశాడు. తాను తీసిన ‘విక్రమ్’ సినిమాలో అతని గత సినిమా ‘ఖైదీ’ విజువల్స్ ను వాడుకున్నాడు. ‘ఖైదీ’ కి ‘విక్రమ్’ కి లింక్ పెట్టాడు. అందువల్ల వీటి సీక్వెల్స్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇవి ఎప్పుడు వచ్చినా బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. ఇదే ఫార్ములాని శైలేష్ కొలను కూడా ఫాలో అవుతూ ఇప్పటికే ‘హిట్’ ‘హిట్ 2’ ‘హిట్ 3’ సినిమాలు చేశాడు. మొత్తంగా 7 సినిమాలు చేస్తాడట.

Sujeeth

ప్రశాంత్ వర్మ సైతం ‘హనుమాన్’ సిరీస్లో భాగంగా 4,5 సినిమాలు చేస్తానని తెలిపాడు. ఇప్పుడు సుజిత్ వంతు వచ్చింది. ఇటీవల వచ్చిన ‘ఓజి’ సినిమాలో ‘సాహో’ తో లింక్ పెట్టాడు. ‘రాయ్ ని అతని కొడుకు గతాన్ని’ కొంచెం చూపించాడు. సో ‘ఓజి’ లో ప్రభాస్ కనిపించకపోయినా అతని పాత్ర అయితే కనిపించింది. అందుకే ‘ఓజి 2’ పై అంచనాలు పెరిగాయి. ఒక రకంగా ఇది ‘సాహో’ కి ప్రీక్వెల్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో అయితే ‘సాహో’ సినిమాని పోస్ట్ మార్టం చేస్తున్నారు. ‘సాహో’ లో హీరోయిన్ కి పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు చూపించారు. ‘ఓజి’ లో పవన్ కళ్యాణ్ కూతురు పెయింటింగ్ వేసినప్పుడు పవన్ మురిసిపోతాడు. కాబట్టి.. ‘ఓజి’ లో పవన్ కూతురు.. ‘సాహో’ లో హీరోయిన్ శ్రద్దా కపూర్ అంటూ ఫిక్స్ అయిపోయారు. అంతేకాదు ‘సాహో’ లో రాయ్, సత్య దాదా కలిసి దిగిన ఫోటో ఉంది.

కాబట్టి.. రాయ్, సత్య దాదా కలిసి బిజినెస్ చేసి ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇక ‘ఓజి’ లో ఫస్ట్ ఫైట్లో ఉన్న ప్లేస్.. ‘సాహో’ ఇంటర్వెల్ సీన్ వద్ద కనిపిస్తుందట. ఆ సీన్లో ప్రభాస్ కొన్ని ఫోటోలు తగలబెడుతూ ఉంటాడు. అవి ‘ఓజి’ లో కూడా కనిపించాయట. నెటిజన్లు ఆరాలు తీయడం ఎలా ఉన్నప్పటికీ ‘ఓజి’ లో ‘సాహో’ తో లింక్ పెట్టారు అన్నది నిజం. ‘ఓజి 2’ లో కనుక ప్రభాస్ ని పెడితే… ఆడియన్స్ కి పూనకాలు రావడం గ్యారంటీ.

దర్శకుడిగా మారబోతున్న ‘పుష్ప’ యాస స్పెషలిస్ట్‌.. హీరోగా సీమ స్టార్‌!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus